Rakul Preet Singh : రకుల్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను.. జస్ట్ ప్రేమ మాత్రమే

ఇటీవల రకుల్‌ బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. ఇక వీరి ప్రేమ విషయం తెలిశాక త్వరలోనే వీరు పెళ్లి ....

Rakul Preet Singh : రకుల్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను.. జస్ట్ ప్రేమ మాత్రమే

Rakul (1)

Rakul Preet Singh :  తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తుండటంతో అక్కడే సెటిల్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది. ఇటీవల తన 31వ బర్త్‌డే సందర్భంగా తన రిలేషన్‌షిప్‌ గురించి రివీల్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది రకుల్. సోషల్ మీడియా వేదికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది.

Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిల్లో విడుదల అయ్యే సినిమాలు ఇవే

ఇక వీరి ప్రేమ విషయం తెలిశాక త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా తన పెళ్లి గురించి నోరు విప్పింది రకుల్. ప్రస్తుతం రకుల్ నటించిన “థాంక్స్ గాడ్” సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రకుల్. ఇందులో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాలు హీరోలుగా నటిస్తున్నారు.

Bigg Boss Priya : ప్రియా కూతురి పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ తన పెళ్లి గురించి మాట్లాడింది. ”నాకు నచ్చిన విషయాలు వినడానికి మాత్రమే నేను ఇష్టపడతాను. నా ప్రేమ నా వ్యక్తిగతం. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయటపెట్టానంటే అది ఒక అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నాను. అందుకే పోస్ట్ చేశాను. నా పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. కొన్ని రోజులు మేమిద్దరం ప్రేమలో ఉండాలనుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరితో ఆ విషయాన్నీ షేర్ చేస్తాను” అని తెలిపింది రకుల్.