RC15 Movie: RC15 మూవీ సెట్‌లో చరణ్ బర్త్‌డే అడ్వాన్స్ సెలెబ్రేషన్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీ ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ షూట్ పూర్తవడంతో, చిత్ర సెట్స్ లో చరణ్ బర్త్ డే వేడుకను అడ్వాన్స్ గా నిర్వహించారు.

RC15 Movie: RC15 మూవీ సెట్‌లో చరణ్ బర్త్‌డే అడ్వాన్స్ సెలెబ్రేషన్స్..!

Ram Charan Advanced Birthday Celebrations In RC15 Movie Sets

RC15 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తోండగా.. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

RC15: సంక్రాంతి బరిలో ముందుగా ల్యాండ్ అవుతున్న మెగా పవర్ స్టార్..?

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజాగా ఓ సాంగ్‌ను షూట్ చేస్తోంది. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజిషన్‌లో తెరకెక్కుతున్న ఈ సాంగ్ షూట్ నేటితో ముగిసింది. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ముందుగానే సెలబ్రేట్ చేశారు. హీరో చరణ్ కేక్ కట్ చేసి ఈ సాంగ్ షూట్‌కు ప్యాకప్ చెప్పడంతో పాటు తన బర్త్‌డేను అడ్వాన్స్‌గా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ కియారా అద్వానీ, ప్రభుదేవా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు హీరో చరణ్’కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ముగించేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.