మూడు భాగాలుగా ఆర్జీవీ బయోపిక్.. మూడో పార్టులో వర్మే నటిస్తాడంట..

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 09:16 PM IST
మూడు భాగాలుగా ఆర్జీవీ బయోపిక్.. మూడో పార్టులో వర్మే నటిస్తాడంట..

Ram Gopal Varma Biopic: బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలతో 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన పార్ట్ 1 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం(26) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుందని, మొత్తం 3 చిత్రాలు కలిపి 6 గంటల సినిమాగా వర్మ చరిత్ర ఉండబోతోందని తెలిపారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో దొరసాయి తేజ ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

పార్ట్ 1లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 సినిమాలో వేరే నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 3లో ఆర్జీవీయే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు. 3 పార్టుల్లో, ఒక్కొక్క పార్టు ఆర్జీవీ జీవితంలోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపించబోతున్నట్టుగా తెలియజేశారు.

మొదటి భాగం సినిమా పేరు ‘రాము’. రామ్ గోపాల్ వర్మ ఆరంభం. దీంట్లో ఆయన విజయవాడ కాలేజ్ రోజులు, ఆయన తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాoగ్ ఫైట్స్‌తో మొదలై, ఆయన శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు, రిలేషన్ షిప్స్‌ను ఎలా మాయ చేసి వాడుకున్నాడు అన్నది ప్రధాన కథాంశంగా చూపెట్టనున్నారు.

పార్ట్ 2 ‘రామ్ గోపాల్ వర్మ’ అండర్ వరల్డ్‌తో ప్రేమాయణం. ఇది తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్‌తో ఆయనకున్న అనుబంధాల గురించి చూపెట్టబడుతుంది. పార్ట్ 3 ‘ఆర్.జి.వి’ ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది ఆయన ఫెయిల్యూర్స్, వివాదాలు.. దేవుళ్ళ పట్ల, శృంగారం పట్ల, సమాజం పట్ల ఆయనకి ఉన్న విపరీత వైఖరులతో పాటు.. చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

RAMU