Rashmika Mandanna : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన రోజుకో వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ 'కాంతార' సినిమా విషయంలో.. తనని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అంటూ విమర్శలు ఎదురుకుంది. ఇప్పుడు తాజాగా సౌత్ సినిమాలపై ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Rashmika Mandanna : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక..

Rashmika is involved in another controversy

Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక మందన రోజుకో వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమా విషయంలో.. తనని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అంటూ విమర్శలు ఎదురుకుంది. ఇప్పుడు తాజాగా సౌత్ సినిమాలపై ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం రష్మిక హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది.

Rashmika : ఇకపై మిమ్మల్ని ప్రతి సంవత్సరం కలుస్తాను.. వర్చువల్ ఫ్యాన్స్ మీట్ ప్లాన్ చేస్తోన్న రష్మిక..

1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటిలో జనవరి 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక.. “బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. నా వరకు నా చిన్నప్పటి నుంచి రొమాంటిక్ సాంగ్స్ అంటే అవి బాలీవుడ్ సాంగ్స్. కానీ సౌత్‌లో మాస్ మసాలా సాంగ్స్, ఐటమ్ నంబర్స్, డాన్స్ నంబర్స్” అంటూ హాస్యాస్పదంగా వ్యాఖ్యానించింది.

నిజానికి రొమాంటిక్ సాంగ్స్‌తోనే కెరీర్ మొదటిలో రష్మిక సౌత్‌లో ఫేమ్ ని సంపాదించుకుంది. ఈ అమ్మడు నటించిన కిర్రాక్ పార్టీ, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ ఎంతటి హిట్టుని అందుకన్నాయో అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు రాగానే, ఇలా సౌత్ సినిమాలని తక్కువ చేసి మాట్లాడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. మరి రష్మిక ఈ వివాదాన్ని ఎలా ఎదురుకుంటుందో చూడాలి.