Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే

రష్మిక మాట్లాడుతూ.. ''ప్రస్తుతం సౌత్ సినిమాలని నార్త్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 లాంటి విజయాలే అందుకు నిదర్శనం. కానీ సౌత్ సినిమాలు.................

Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే

Rashmika

 

Rashmika Mandanna :  గత కొన్ని నెలల నుంచి సౌత్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడు లేనంతగా దేశమంతటా సౌత్ సినిమాలపై చర్చ జరుగుతుంది. కొంతమంది అభినందిస్తూ ఈ సక్సెస్ లో వారు కూడా భాగమవ్వాలి అనుకుంటుంటే, మరి కొంతమంది సౌత్ సినిమాల సక్సెస్ చూడలేక కుళ్ళుకుంటున్నారు. ఇక సౌత్ సినిమాల సక్సెస్ పై ఒక్కొక్కరు పలువురు సెలబ్రిటీలు ఒక్కో విధంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ, బాలీవుడ్ లో కూడా సినిమాలు ఓకే చేసుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోవడానికి రెడీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సౌత్ సినిమాలపై వ్యాఖ్యలు చేసింది.

Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..

రష్మిక మాట్లాడుతూ.. ”ప్రస్తుతం సౌత్ సినిమాలని నార్త్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌-2 లాంటి విజయాలే అందుకు నిదర్శనం. కానీ సౌత్ సినిమాలు ఒక్కసారిగా హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకోలేదు. ఇటీవల నేను నార్త్ లో ఓ పల్లెటూరికి షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలని సౌత్ సినిమాల గురించి అడిగితే తాము ఎప్పటి నుంచో సౌత్‌ సినిమాలను టీవిలో చూస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇలా థియేటర్లో చూడం కొత్తగా ఉంది అన్నారని తెలిపింది. ఇక సౌత్ సినిమాల్లో మన సంస్కృతి, ఆచార వ్యవహారాల్ని, మూలాల్ని మర్చిపోరు, అవి కూడా సందర్భం వచ్చినప్పుడు చూపిస్తారు. అవి అక్కడి ప్రజలకి బాగా కనెక్ట్ అవుతాయి, అందుకే ఇటీవల మన సౌత్ సినిమాలు నార్త్ లో భారీ విజయాలు సాధిస్తున్నాయి” అని రష్మిక తెలిపింది.