Raviteja : మెగాస్టార్ చేతుల మీదుగా ‘రావణాసుర’ ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రవితేజ కొత్త సినిమా ప్రారంభమయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవాళ పూజా కార్యక్రమాలని నిర్వహించింది. అలాగే మెగాస్టార్ చేతుల మీదుగా...............

Raviteja : మెగాస్టార్ చేతుల మీదుగా ‘రావణాసుర’ ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Raviteja

Raviteja :   మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమాతో గత సంవత్సరం భారీ విజయం సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో వరుస సినిమాలని అనౌన్స్ చేశాడు. ఇప్పటికే రవితేజ సినిమా ‘ఖిలాడీ’ రిలీజ్ కి రెడీగా ఉంది. మరో సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ లో ఉంది. తాజాగా మరో సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టేస్తున్నాడు. ఇవాళ తన కొత్త సినిమా ‘రావణాసుర’ ముహూర్తం షూటింగ్ జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రవితేజ కొత్త సినిమా ప్రారంభమయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవాళ పూజా కార్యక్రమాలని నిర్వహించింది. అలాగే మెగాస్టార్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ‘రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనబడబోతున్నాడు. రవితేజ కెరీర్ లో తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Sankalp Reddy : బాలీవుడ్‌లోకి మరో తెలుగు దర్శకుడు

ఒకపక్క కరోనాతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుంటే రవితేజ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశాడు. 2022 సెప్టెంబర్ 30న రావణాసుర సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని రవితేజ మరియు అభిషేక్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నారు.