Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్వూ పేరుతో ‘రొమాంటిక్’ హీరో హీరోయిన్లను ఓ ఆట ఆడుకున్నారు..

Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

Romantic

Prabhas: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న మూడో సినిమా ‘రొమాంటిక్’.. కేతికా శర్మ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Romantic Movie : ఎవడైతే నాకేంటంటా ‘లకిడికపూల్’
పాటలకు, ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరి తనయుడి సినిమా కావడంతో డార్లింగ్ ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘రొమాంటిక్’ మూవీకి తమవంతు సపోర్ట్ అందించారు. ప్రభాస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి సినిమాకి మరింత బూస్టప్ ఇచ్చాడు విజయ్. పిక్చర్ అక్టోబర్ 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టీంతో కలిసి సందడి చేసిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లతో కలిసి హంగామా చేశారు. ‘రొమాంటిక్ డేట్ విత్ ప్రభాస్’ పేరుతో సాగిన ఈ ఇంటర్వూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

ఆకాష్, హీరోయిన్ కేతిక మంచి సింగర్ అని ప్రభాస్‌కి చెప్తూ.. మా కోసం సాంగ్ పాడమని అడిగాడు. దానికి కేతిక ‘సార్, నేను బాత్రూం సింగర్‌ని సార్’ అని బదులిచ్చింది. దీంతో ఆకాష్.. ‘ఇదే నీ బాత్రూం అనుకుని పాడెయ్.. మేమెవరం లేం.. డార్లింగ్ కూడా లేరు.. ఏం డార్లింగ్ మీరున్నారా?.. అనగానే.. ప్రభాస్ చిన్నపాటి కోపంతో ‘ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా.. నేను కూడా లేను.. గజాలా.. నువ్వు పాడెయ్’.. అంటూ సరదగా మాట్లాడిన క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.