Romantic : నువ్వు హిట్ కొట్టాలి.. మీ నాన్న కాలర్ ఎత్తాలి : విజయ్ దేవరకొండ

డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు.

Romantic : నువ్వు హిట్ కొట్టాలి.. మీ నాన్న కాలర్ ఎత్తాలి : విజయ్ దేవరకొండ

Akash

Romantic :  డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు.

ఆకాష్ పూరీ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆకాష్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. మూడేళ్లు ప్రాణం పెట్టి సినిమా చేశాం. రమ్యకృష్ణ గారు ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశారు. మా అందరికీ ఈ చిత్రం అవసరం కానీ.. ఈ సినిమాకు రమ్యకృష్ణ గారు అవసరం. కేతిక శర్మ కచ్చితంగా స్టార్ అవుతుంది. ఏ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి ఇండస్ట్రీకి వచ్చాడు మా నాన్న. కష్టపడి ఇండస్ట్రీ అనే మహాసముద్రంలోకి దూకేశాడు. ఇండస్ట్రీకి వచ్చి ఓ బస్సు కొన్నారు. అందులో మా అందరినీ పెట్టుకుని లాంగ్ జర్నీ మొదలుపెట్టారు. కానీ ఓ రాంగ్ పర్సన్ వల్ల జర్నీ ఆగిపోయింది. అయినా మా నాన్న ఒక్కడే బస్సును తోయడం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా తోస్తూనే ఉన్నారు. మా నాన్న గురించి ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే తల పగలగొట్టాలని అనిపించేది. ఇక పూరి సినిమాలు ఎవరు చూస్తారు? టైం అయిపోయిందని అందరూ అన్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్‌తో ఫుల్ హై ఇచ్చారు.

Nagarjuna : నాగార్జునకి ముద్దు పెట్టాలి అంటే రెమ్యునరేషన్ పెంచాలి అంటున్న డస్కీ బ్యూటీ

జీవితం అంటే సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం కాదు మనం చేసే పనిని ఇష్టపడటం అని మా నాన్న చెప్పారు. కానీ నా విషయంలో అది సరిపోదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఫెయిల్ అయితే కాస్త సానుభూతి చూపిస్తారేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడు ఫెయిల్ అయితే మనిషిలా కూడా చూడరు. నీ కొడుగ్గా పుట్టడం నా అదృష్టం నాన్న. నేను కచ్చితంగా సక్సెస్ అవుతాను. ఈడు హీరో ఏంటి? కెరీర్ అయిపోయింది అనే మాటలు విన్నాను. నువ్వు నా కొడుకు ఆకాష్ పూరి అని చెప్పుకునేలా చేస్తాను. ప్రతీ సినిమా మొదటి చిత్రం అనుకుని చేయమన్నావ్ కానీ ఇదే నా లాస్ట్ సినిమా అన్నట్టు చేస్తాను. ప్రాణం పెట్టి చేస్తాను. నా కెరీర్ అయిపోయిందని మాట్లాడుకున్న ప్రతీ ఒక్కరికి నేను చెబుతున్నా.. నో ఇట్స్ నాట్ ఓవర్. నిన్ను కాలర్ ఎగిరేసేలా చేస్తాను. అది ఎప్పుడు అవుతుందో చెప్పలేను. కానీ కచ్చితంగా చేస్తాను. ఇక్కడ నేను కొట్టాలి నువ్ కాలర్ ఎగిరెయ్యాలి. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేస్తా హిట్ అయినా ఇంకోటి చేస్తాను. నాకు ఇది తప్ప ఇంకోటి రాదు. నేను దేనికి పనికి రాను అంటూ పూరి ‘నేనింతే’ సినిమాలో డైలాగ్ చెప్పాడు ఆకాష్.

Prabhas : ప్రభాస్ బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

హిరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకుడు అనిల్ నా ‘లైగర్’ సినిమాకు సిజి వర్క్ చేస్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ ఇచ్చిన ‘నా వల్ల కదే’ అనే పాట నాకు చాలా ఇష్టం. హీరోయిన్ కేతిక తెలివైన, అందమైన అమ్మాయి. ఆమె మంచి సింగర్ కూడా. ఆమెని కలిస్తే పాట పాడమని అడుగుతూ ఉంటాను. ఇందాక ఆకాష్ స్పీచ్ విన్నాను. ఆ స్పీచ్ విన్నాక ఆకాష్ మీద ఇష్టం పెరిగింది. అతనిలో ఫైర్ వుంది. ఇంతమంది ముందు ఇలా మాట్లాడాలంటే దైర్యం ఉండాలి. నీకు చాలా ధైర్యం ఉంది. నువ్వు ఈ సినిమా హిట్ కొట్టాలి. మీ నాన్న కాలర్ ఎత్తాలి అన్నారు. ఆకాష్ సినిమా పిచ్చి గురించి ఛార్మీ చెపుతూ వుంటుంది. ఆకాష్ నీకు ఫైర్ వుంది గట్టిగా కష్టపడు. ‘రొమాంటిక్’ సినిమా నేను చూడలేదు కానీ చుసిన వాళ్ళు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో నా ఫ్రెండ్ కే ఓటు వేయండి అంటున్న ‘ఆర్ఎక్స్100’ భామ

అలాగే తన లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ.. డెస్టినీ నన్ను, ఛార్మిని, పూరీని కలిపింది. డెస్టినీ పురి గారిని నా లైఫ్ లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఒక్క విజువల్ చూస్తే మీకు అర్థమై పోతుంది. మేమంతా ఒక్కటే ఫిక్స్ అయ్యాము 2022లో ఇండియా షేక్ అవ్వాలి లైగర్ సినిమాకి. ఇది ఫిక్స్ అని అన్నారు.

Bigg Boss 5 : లవ్ ఫెయిల్యూర్.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను : షణ్ముఖ్

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ గడ్డ గురించి నాకు బాగా తెలుసు. నా పదేళ్ల వయసున్నప్పుడు స్కూల్‌ తరపున ఇక్కడకు వచ్చాను. నా గురువులు ఈ నేల గొప్పదనం గురించి చెప్పారు. చిన్నతనంలో వేయి స్తంభాల గుడికి వచ్చినప్పుడు ప్రతి స్తంభాన్ని లెక్కబెట్టుకుంటూ తిరిగాను. అప్పటి నుంచి నాకు ఈ నగరంతో అనుబంధం ఉంది. ఇక నుంచి నా సినిమాల ప్రతి వేడుక వరంగల్‌లోనే జరిగేలా చూస్తాను అన్నారు. ‘రొమాంటిక్’ సినిమాని దర్శకుడు అనిల్ బాగా తీశాడు. నేను నాలుగు అయిదు సార్లు చూసాను. ఎక్కడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఇంకా బాగా నచ్చాయి. ఆకాష్ కేతికలు బాగా చేసారు. నా కొడుకు గురించి ఎక్కువ చెపితే బాగోదు.వాడు చిన్నప్పటి నుంచి లేవగానే డైలాగ్ చెప్పి వేషం అడిగేవాడు. నా కొడుకు గురించి ఓకే ఒక్క మాట చెపుతాను. ఆకాష్ వెరీ గుడ్ యాక్టర్. రమ్యకృష్ణ ఈ సినిమాలో చెయ్యడం మా అదృష్టం. ఛార్మీ నా స్ట్రెంత్. నాకు ఏ తలనొప్పి లేకుండా అన్ని చూసుకుంటుంది. ఇక ‘లైగర్’ గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో ‘లైగర్’ చేస్తున్నాను.అతను యాక్షన్ చూసి నేనే షాక్ అవుతున్నాను. మీతో పాటు నేను ఈ సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాను. అంతా బాగా నటిస్తున్నాడు. థాంక్స్ విజయ్ అని అన్నారు.