Saakini Daakini: బుల్లితెరపై సందడి చేసేందుకు వస్తున్న ‘శాకిని డాకిని’

అందాల భామలు నివేదా థామస్, రెజీనా క్యాసాండ్రా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘శాకిని డాకిని’ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో నివేథా, రెజీన చేసిన టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Saakini Daakini: బుల్లితెరపై సందడి చేసేందుకు వస్తున్న ‘శాకిని డాకిని’

Saakini Daakini Movie Locks World TV Premiere Date

Saakini Daakini: అందాల భామలు నివేదా థామస్, రెజీనా క్యాసాండ్రా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘శాకిని డాకిని’ రీసెంట్‌గా రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో నివేథా, రెజీన చేసిన టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Saakini Daakini: ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘శాకిని డాకిని’..!

ఇక ఇప్పుడు ఈ సినిమాను బుల్లితెరపై టెలికాస్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా ఈ సినిమాను డిసెంబర్ 24న రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ట్రెయినింగ్‌లో ఉన్న ఇద్దరు లేడీ పోలీసులకు అనుకోకుండా ఎదురైన సమస్యను వారు ఎలా పరిష్కరించారనేది మనకు ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలో ఈ ఇద్దరు భామలు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో భానుచందర్, పృథ్వీరాజ్, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి బుల్లితెరపై ఈ ‘శాకిని డాకిని’లు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.