Salaar : పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న సలార్.. నిజమేనా?

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ (Salaar) చిత్రం పాన్ ఇండియా వైడ్ కాదట, పాన్ వరల్డ్ మూవీగా విడుదల కాబోతుంది అని తెలుస్తుంది. మరి ఈ విషయం..

Salaar : పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న సలార్.. నిజమేనా?

Salaar

Salaar : ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. దాదాపు అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే. ఇక వీటిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’ (Salaar). కేజీఎఫ్ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లనుంది. ఈ విషయాన్ని ఇటలీ మీడియా కూడా ప్రింట్ చేయడం గమనార్హం. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ కాదట, పాన్ వరల్డ్ మూవీగా విడుదల కాబోతుంది.

Salaar: ఉగాది రోజున సలార్ అప్డేట్.. ఏమై ఉంటుందో..?

ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కుదిరితే అన్ని భాషలతో పటు ఒకేసారి, లేదా తరువాత అయిన రిలీజ్ చేయనున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడి పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.

Salaar : ఇటలీ మీడియాలో ‘సలార్’ గురించి న్యూస్.. ఏంటో తెలుసా?

కేజీఎఫ్ చిత్రాలు నిర్మించిన హొంబాలే ఫిలింస్ ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రభాస్ నటించిన మరో మూవీ ఆదిపురుష్ (Adipurush) గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్‌పోన్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.