Salman Khan: బాలీవుడ్ చేరిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ మూవీలో అదరగొట్టిన తెలంగాణ సాంగ్!

సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాలో తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మకు సంబంధించి ఓ పాటను తెలుగులో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Salman Khan: బాలీవుడ్ చేరిన బతుకమ్మ.. సల్మాన్ ఖాన్ మూవీలో అదరగొట్టిన తెలంగాణ సాంగ్!

Salman Khan Surprises All With Bathukamma Song In Kisi Ka Bhai Kisi Ki Jaan

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. ఇక అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగునాట కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు ఇమెయిల్.. 5 ఏళ్లగా మర్డర్ ప్లాన్.. అసలు కథ ఏంటి?

తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్టేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని ‘బతుకమ్మ’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మను చూపిస్తూ, ఓ పాటను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సాంగ్ లిరిక్స్ కూడా తెలుగులోనే ఉన్నాయి. ఓ బాలీవుడ్ సినిమాలో ఇలా బతుకమ్మ సాంగ్.. అది కూడా తెలుగులో ఉండటం విశేషమని చెప్పాలి. ఇక ఈ పాటలో విక్టరీ వెంకటేష్‌తో పాటు అందాల భామ పూజా హెగ్డే కూడా కనిపిస్తున్నారు.

Salman Khan: సల్మాన్ డ్యాన్స్ స్టెప్‌పై వైరలవుతోన్న నెటిజన్స్ కామెంట్స్

బతుకమ్మ సాంగ్‌కు పూజా హెగ్డే దాండియా స్టెప్స్ వేస్తూ కనిపించింది. అటు సల్మాన్ ఖాన్ కూడా పంచకట్టులో కనిపించి అభిమానులను థ్రిల్ చేశాడు. ఈ సినిమాను ఫర్హద్ సామ్‌జీ డైరెక్ట్ చేస్తుండగా, తమిళ సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు కేజీయఫ్ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.