Samantha : రూటు మార్చి జోరు పెంచిన సమంత.. ‘పుష్ప’లో ఐటెం సాంగ్

గతంలో సమంత కమర్షియల్ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. మొదటి సినిమాలోనే లిప్ కిస్ సీన్స్ కూడా చేసింది. సూర్యతో నటించిన ఒక సినిమాలో అయితే బికినీ కూడా వేసి తన అందాలతో అభిమానులని

Samantha : రూటు మార్చి జోరు పెంచిన సమంత.. ‘పుష్ప’లో ఐటెం సాంగ్

Samantha Pushpa

Samantha :  సమంత చైతన్యతో విడాకుల తర్వాత బిజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. ఒకపక్క ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ మరో పక్క వరుస సినిమాలకి ఓకే చెప్తుంది. పెళ్లి అయిన తర్వాత సమంత సినిమాల వేగం తగ్గిందనే చెప్పొచ్చు. అంతే కాక పెళ్లి అయ్యాక సెలెక్టెడ్ కథలని మాత్రమే చేసింది. హద్దులు దాటకుండా ఉండే పాత్రలని చూసి చేసింది. ఇప్పుడు విడాకులు అవ్వడంతో మళ్ళీ తన పాత పంథాలోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది.

Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన ’18 పేజీలు’

గతంలో సమంత కమర్షియల్ హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. మొదటి సినిమాలోనే లిప్ కిస్ సీన్స్ కూడా చేసింది. సూర్యతో నటించిన ఒక సినిమాలో అయితే బికినీ కూడా వేసి తన అందాలతో అభిమానులని కట్టి పడేసింది. కొన్ని కొన్ని సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్ గా అందాల ఆరబోత చేసింది. కానీ పెళ్లి అయ్యాక అందాల ఆరబోతకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు తాజాగా మరోసారి తన పాత రూట్ లోకి వెళ్లి జోరు పెంచబోతుంది సమంత.

Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్ బాస్ కప్పు గెలవాలి : సజ్జనార్

స్టార్ హీరోయిన్స్ అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉంటారు. అనుష్క, కాజల్, తమన్నా, పూజ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేశారు. తాజాగా సమంత కూడా ఐటెం సాంగ్ చేయబోతుంది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేయబోతున్నట్టు సమాచారం. సమంత సుకుమార్ తో ‘రంగస్థలం’ సినిమా చేసింది. అల్లుఅర్జున్ తో ‘s/o సత్యమూర్తి’ సినిమా చేసింది. తాజాగా మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం.

Bigg Boss 5 : నిన్న దీప్తి.. ఇవాళ జ్యోతి.. సన్నీపై ఫైర్ అవుతున్న మాజీ కంటెస్టెంట్స్

ఈ సాంగ్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ కూడా వేస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ సాంగ్ షూటింగ్ ఉండబోతుందని సినీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా సమంత విడాకుల తర్వాత మళ్ళీ తన పాత రూట్లోకి వచ్చేసి వరుస సినిమాలతో, ఇలా ఐటెం సాంగ్స్ తో అభిమానులని అలరించబోతుందని అర్ధమవుతుంది. ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటిదాకా ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే ఎదురుచూసేవారు. ఈ విషయం తెలిసాక సమంత ఫ్యాన్స్ కూడా ‘పుష్ప’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.