Samantha : ‘ఖతిజా’గా సమంత.. సమంతలో మరో కొత్తకోణం

తాజాగా విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళ్ లో రాబోతున్న చిత్రం 'కాతువాకుల రెండు కాధ‌ల్' నుంచి సామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. స‌మంత ఇందులో ఖ‌తిజా పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Samantha : ‘ఖతిజా’గా సమంత.. సమంతలో మరో కొత్తకోణం

Sam

Samantha :  సమంత చైతన్యతో విడాకుల తర్వాత జోరు పెంచింది. ఒక పక్క ఫ్రెండ్స్ తో విహార యాత్రలు చేస్తూ మరో పక్క వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే సమంత తెలుగులో ‘శాకుంతలం’ సినిమా షూట్ కంప్లీట్ చేసింది. తమిళ్ లో ‘కాతువాకుల రెండు కాధ‌ల్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ దశలో ఉంది. ఇవి కాకుండా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యే రెండు సినిమాలకు సైన్ చేసింది. ఇవి త్వరలో షూటింగ్ ని మొదలు పెట్టనున్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయనుంది సమంత. ఇలా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.

Radheshyam first song : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ అద్భుతమైన లిరిక్స్…

తాజాగా విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళ్ లో రాబోతున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాధ‌ల్’ నుంచి సామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. స‌మంత ఇందులో ఖ‌తిజా పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ పోస్టర్ లో సమంత పబ్ లో ఎంజాయ్ చేస్తూ దేని గురించో ఆలోచూస్తున్నట్టు ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, నయనతార మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సమంత చాలా గ్యాప్ తర్వాత మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తుంది.