Samyuktha : సార్ సూపర్ హిట్ తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త..

మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో బీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీమ్లా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లో...........

Samyuktha : సార్ సూపర్ హిట్ తో టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త..

Samyuktha Menon gets hat trick hits with dhanush sir movie in tollywood

Samyuktha :  మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో బీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బీమ్లా నాయక్ సినిమా హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ టాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాతో వచ్చి మరో హిట్ కొట్టింది. వరుసగా వెంటవెంటనే రెండు సినిమాలు విజయాలు సాధించి తాజాగా సార్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మలయాళ కుట్టి.

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా దర్శకుడు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సార్ సినిమా తెరకెక్కింది. ధనుష్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.

ముందు రోజే ప్రీమియర్ షోలు కూడా వేయడంతో ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది సార్ సినిమా. చదువు అందరికి అవసరం అనే మంచి కాన్సెప్ట్ ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ చాలా చక్కగా తీశాడు. ఈ సినిమాకి చాలా మంది ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. కొన్ని సీన్లు కంటతడి పెట్టించాయి. దీంతో సార్ సినిమా మూవీ అందరికి నచ్చుతుంది. మొదటి రోజుకు ముందే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ధనుష్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sir Movie : ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న సార్..

ఇక ఈ సినిమాలో సంయుక్త చాలా పద్దతిగా చీరలో కనపడి తన అందంతో, నటనతో అందర్నీ మెప్పించింది. మాస్టారు మాస్టారు సాంగ్ లో సంయుక్తని చాలా బాగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా సంయుక్త బాగా నటించింది. ధనుష్ కి సపోర్ట్ గా ఉండే పాత్రలో ఒదిగిపోయింది. సార్ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో సంయుక్త బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగానే వరుస మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడంతో ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ సంయుక్త వైపు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో బింబిసార 2తో పాటు మరో రెండు సినిమాలు సంయుక్త చేతిలో ఉన్నాయి. ఇక సార్ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు, తమిళ్ లో సంయుక్తకి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.