Vijay Devarakonda : ఒడిశా సముద్ర తీరంలో 'లైగర్'.. సైకత శిల్పంతో | Sand art for liger movie in Odisha

Vijay Devarakonda : ఒడిశా సముద్ర తీరంలో ‘లైగర్’.. సైకత శిల్పంతో

తాజాగా ఒడిశాకు చెందిన సైకత శిల్పి దశరథ్ మొహంతా ఒడిశా రాష్ట్రంలో సముద్ర తీరాన 'లైగర్' సినిమా పోస్టర్ ని సైకత శిల్పంలా చెక్కారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ఉండి లైగర్ అని సినిమా.....

Vijay Devarakonda : ఒడిశా సముద్ర తీరంలో ‘లైగర్’.. సైకత శిల్పంతో

Liger :  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఇందులో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

‘లైగర్’ సినిమాని పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2022 ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఇప్పటికే విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు.

RGV : ఆర్జీవీ ‘కొండా’ కథ ఇదేనా??

తాజాగా ఒడిశాకు చెందిన సైకత శిల్పి దశరథ్ మొహంతా ఒడిశా రాష్ట్రంలో సముద్ర తీరాన ‘లైగర్’ సినిమా పోస్టర్ ని సైకత శిల్పంలా చెక్కారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ ఉండి లైగర్ అని సినిమా పేరుతో పాటు సాలా క్రాస్ బీడ్ అనే ట్యాగ్ లైన్ ని కూడా సైకత శిల్పంలో చూపించాడు. ఇప్పుడు ఈ ‘లైగర్’ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ అభిమానులు ఈ సైకత శిల్పాన్ని షేర్ చేస్తున్నారు.

×