RGV : ఆర్జీవీ ‘కొండా’ కథ ఇదేనా??

'కొండా' సినిమా గురించి చెప్తూ ఓ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని తన ఛానల్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ వీడియోలో ఆర్జీవీ కొండా సినిమా కథ మొత్తం ఇండైరెక్ట్ గా చెప్పేశారు. దీంతో తెలంగాణ......

RGV : ఆర్జీవీ ‘కొండా’ కథ ఇదేనా??

Konda

RGV :  ఆర్జీవీ సినిమాల్లో సృష్టించిన సెన్సేషన్స్ అంతా ఇంతా కావు. కాని సినిమాల కంటే తన ట్వీట్స్ తో, మాటలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎవరి బయోపిక్ అయినా ధైర్యంగా తీయగలిగే సత్తా ఆర్జీవికి ఒక్కడికే ఉంది. అందుకే రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది.

గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ‘కొండా’ సినిమా గురించి చెప్తూ ఓ వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని తన ఛానల్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ వీడియోలో ఆర్జీవీ కొండా సినిమా కథ మొత్తం ఇండైరెక్ట్ గా చెప్పేశారు. దీంతో తెలంగాణ రాజకీయ నాయకులకి ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.

ఈ వీడియోలో.. ”కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరాశక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే మా ‘కొండా’ చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్.

ఇకపోతే ఆర్కే, భారతక్క. తెలంగాణలో ఒక సామెత ఉంది. ‘పొట్టోన్ని పొడుగోడు కొడితే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు’ ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీస్ లను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండె లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది.

Priyanka Singh : స్టార్ రైటర్‌తో ప్రియాంక సింగ్.. త్వరలో సినిమా..

పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శక్తులుగా నాకు అనిపించబట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను. ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి. కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే.. యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వరంగల్ వంచనగిరిలో ఒక అత్యంత దారుణ హత్యా ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్ లకి ముందు కథ, వాటి తర్వాత కథే మా ‘కొండా’ కథ.” అంటూ తన వాయిస్ తో ఈ సినిమా గురించి చెప్పారు.

Sree Leela : నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’లో రాణి ఈమె?

చాలా రోజుల తర్వాత ఆర్జీవీ డైరెక్ట్ గా తాను డైరెక్ట్ చేసిన సినిమా కావడం, ఈ సారి నక్సలైట్లపై సినిమా, తెలంగాణ రాజకీయాలపై సినిమా కావడంతో కొండా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కొండా దంపతులిద్దరూ వరంగల్ నాయకులు కావడంతో, వరంగల్ లోనే సినిమా షూట్ చేయడంతో వరంగల్ ప్రజలు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.