Suhana Khan: సుహానా ఫోటోషూట్.. షారుఖ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సుహానా ఖాన్‌.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు. తల్లితండ్రుల నుండి అందచందాలను పుణికిపుచ్చుకున్న సుహానా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అది వైరల్‌ అవుతూనే ఉంటుంది.

10TV Telugu News

Suhana Khan: సుహానా ఖాన్‌.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు. తల్లితండ్రుల నుండి అందచందాలను పుణికిపుచ్చుకున్న సుహానా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అది వైరల్‌ అవుతూనే ఉంటుంది. బాలీవుడ్ స్టార్ డాటర్స్ గ్రూప్ లో ఒకరైన సుహానా ఎప్పుడూ సోషల్ మీడియాను అట్రాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా కూడా సుహానా అలాంటి ఓ ఫోటో షూట్ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు అవి కాస్త వైరల్ అయ్యాయి. సుహానా తల్లి క్లిక్ మనిపించిన ఈ పిక్స్ లో సుహానా పూల్ ఒడ్డున వైట్ టాప్, బ్లూ డెనిమ్ ధరించి చేతిలో కోకాకోలా క్యాన్ పట్టుకొని ఫోజులిచ్చింది. ఈ పిక్స్ షేర్ చేసిన గౌరీ ఖాన్.. తనకు బ్లూ కలర్ తనకు చాలా ఇష్టమైన రంగని పేర్కొనగా ఈ ఫోటోలపై తండ్రి షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సాధారణంగా సుహానా ఫోటో షూట్స్ పై షారుఖ్ స్పందించడం చాలా అరుదు. కానీ.. ఈ తాజా ఫోటోలలో భార్య, కూతురిని అభినందించాడు. సుహానా ఏ కలర్ వేసుకున్నా అది మాకు ఇష్టమైన కలర్ అంటూ కూతురుపై ప్రేమను చూపించాడు. షారుఖ్ సహనటి మహిరా ఖాన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ గౌరీని ఉత్తమ ఫోటోగ్రాఫర్ అని, సుహానా ఎంత అందంగా ఉందని కామెంట్ చేసింది. షానయ కపూర్, మహీప్ కపూర్, సీమా ఖాన్, భవానా పాండే ఈ పోస్ట్‌పై స్పందిస్తూ ఈ తల్లి కూతుళ్ళను అభినందించారు.

కాగా, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ కు ముగ్గురు పిల్లలు కాగా కుమారులు ఆర్యన్, అబ్రామ్ కుమార్తె సుహానా. సుహానా ప్రస్తుతం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ కోర్సు చేస్తూ.. తండ్రిలాగా వెండితెర మీద వెలిగిపోవాలని కోరుకుంటుంది. ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించిన సుహానా ఇకపై వెండితెర మీదకి ఎంట్రీ ఇవ్వడమే ఖాయంగా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

10TV Telugu News