Siddharth : వరుస సినిమాలతో.. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న సిద్దార్థ్..

సిద్ధార్థ్ ఫుల్ ఫామ్ లో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇటీవల సిద్ధార్థ్ పుట్టిన రోజు కావడంతో ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Siddharth : వరుస సినిమాలతో.. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న సిద్దార్థ్..

Siddharth busy again with films wants to make a grand comeback

Siddharth :  బాయ్స్(Boys), బొమ్మరిల్లు(Bommarillu), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్(Oye).. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సిద్ధార్థ్. తమిళ్ హీరో అయినా తెలుగు సినిమాలతోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నాడు. తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలు చేసాడు సిద్ధార్థ్. 44 ఏళ్ళ వయసులో ఇప్పుడు కూడా చాలా యంగ్ గా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తెలుగులో సిద్ధార్థ్(Siddharth) కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

2017 వరకు వరుసగా సినిమాలు చేసిన సిద్ధూ ఆ తర్వాత కెరీర్ లో స్లో అయిపోయి అడపాదడపా సినిమాలు చేశాడు. చివరగా తెలుగులో మహాసముద్రం సినిమాతో పలకరించినా ఆ సినిమా పరాజయం పాలైంది. ఇప్పుడు సిద్ధార్థ్ ఫుల్ ఫామ్ లో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇటీవల సిద్ధార్థ్ పుట్టిన రోజు కావడంతో ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Kushboo : ‘వారసుడు’లో తన పాత్ర ఎడిటింగ్‌లో తీసేయడంపై స్పందించిన ఖుష్బూ..

సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ జంటగా టక్కర్ అనే తెలుగు, తమిళ్ సినిమా రాబోతుంది. ఇటీవల సిద్ధార్థ్ పుట్టిన రోజున ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఇండియన్ 2లో సిద్ధార్థ్ కన్ఫామ్ అంటూ ఫస్ట్ లుక్ కూడా రిలిజ్ చేశారు. అలాగే ఒక పాపకి, తన బాబాయ్ కి ఉన్న బంధం గురించి చెప్పే కథతో చిత్తా అనే తమిళ్ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఒకేసారి మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో సిద్ధూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇవే కాక మరికొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఇటీవల సరిగమప సింగింగ్ ప్రోగ్రాంకి గెస్ట్ గా వచ్చి, పాటలు కూడా పాడి అలరించాడు సిద్ధార్థ్. మొత్తానికి కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్నాడు సిద్ధూ.

View this post on Instagram

A post shared by Siddharth (@worldofsiddharth)