South Heroins : బాలీవుడ్ లో సౌత్ బ్యూటీల హవా..

ప్రజెంట్ సౌత్ బ్యూటీస్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏ క్రేజీ మూవీ చూసినా అందులో సౌత్ హీరోయిన్ ఉండాల్సిందే. ఇప్పుడు 5 బడా హిందీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్స్ గా సౌత్ బ్యూటీసే నటించడం విశేషం. ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ లో.....................

South Heroins : బాలీవుడ్ లో సౌత్ బ్యూటీల హవా..

South Heroins Getting offers from Bollywood big projects

South Heroins :  ప్రజెంట్ సౌత్ బ్యూటీస్ క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఏ క్రేజీ మూవీ చూసినా అందులో సౌత్ హీరోయిన్ ఉండాల్సిందే. ఇప్పుడు 5 బడా హిందీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్స్ గా సౌత్ బ్యూటీసే నటించడం విశేషం. ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జూన్ 3న వరల్డ్ వైడ్ గానూ, పాన్ ఇండియా రేంజ్ లోనూ సినిమా రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ గా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఇలా బాలీవుడ్ హీరో సరసన నయన్ హీరోయిన్ గా నటించడం ఇదే ఫస్ట్ టైమ్. షారుఖ్ రీసెంట్ మూవీ పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో జవాన్ పై అంచనాలు మరింత పెరిగాయి.

సౌత్ లో మరో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప సినిమాతో అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ‘పష్ప 2’ లో అదే పాత్రను కంటిన్యూ చేస్తు్న్న రష్మిక బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ లవ్ స్టోరీ ‘యానిమల్’. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర ఎంతో రెబల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిట్టైతే రష్మిక మందన్న రేంజ్ బాలీవుడ్ లో మరింత పెరగడం ఖాయం.

అజయ్ దేవ్ గణ్ హీరోగా, ఆయన డైరెక్షన్ లోనే తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ భోళా. తమిళ సూపర్ హిట్ మూవీ ఖైదీ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. పెరోల్ పై విడుదలైన ఓ ఖైదీ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్నదే సినిమా కథాంశం. ఒరిజినల్ వెర్షన్ లో చాలా మార్పులు చేసి హిందీ వెర్షన్ భోళా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ అమలాపాల్ నటిస్తోంది. బాలీవుడ్ లో నటించడం అమలాపాల్ కు కెరీర్ పరంగా అడ్వాంటేజ్ కాబోతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫ్యామిలీమెన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ లో ఇదే వెబ్ సిరీస్ లో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించింది. యాక్షన్ సీక్వెన్స్ లతో జనాన్ని థ్రిల్ చేయబోతున్న ఈ సిరీస్ షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ‘ఫ్యామిలీమెన్ 2’ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈ వెబ్ సిరీస్ పై కూడా అంచనాలు పెట్టుకుంది.

Nani – Vishwaksen : నాని, విశ్వక్ సేన్.. పాన్ ఇండియా సినిమాలతో వారం గ్యాప్‌తో గ్రాండ్ ఎంట్రీ

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్లూభాయ్ లేటెస్ట్ మూవీ ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’. ఫర్హాన్ సమ్ జీ దీనికి డైరెక్టర్. ఈ ఏడాదే సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా క్రేజీ సౌత్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాతో పూజా బాలీవుడ్ లో ఎలాగైనా సక్సెస్ సాధించాలనుకుంటోంది. ఇళ్ల సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో వరుస సినిమాలు, భారీ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా టాలీవుడ్, సౌత్ లో సక్సెస్ అయిన రాశిఖన్నా, రకుల్ ప్రీత్.. లాంటి భామలు కూడా ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు.