Squid Game : నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌ రీమేక్.. ఏ భాషలోకో తెలుసా?

2021లో ఆడియన్స్ కి ముందుకు వచ్చిన కొరియన్ డ్రామా సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game) సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ని ఇప్పుడు రీమేక్ చేయబోతున్నారట.

Squid Game : నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్‌ రీమేక్.. ఏ భాషలోకో తెలుసా?

Squid Game is remake by american film maker David Fincher

Squid Game : ప్రస్తుతం సినిమాలు కంటే వెబ్ సిరీస్‌లు ఎక్కువ సక్సెస్ రేట్ ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీని సంపాదించుకున్న సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). కొరియన్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది. డెడ్లీ చిల్డ్రన్ గేమ్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోవడంతో సెకండ్ సీజన్ ని తీసుకు రావడానికి సిద్ధమయ్యారు మేకర్స్.

Dil Raju : దిల్ రాజు పాన్ ఇండియా టార్గెట్.. సౌత్ సినిమాలతోనే..

ఈ క్రమంలోనే ఇప్పటికే అందుకు సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఏడాది సమ్మర్ లో సెకండ్ సీజన్ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు ఇప్పటికే తెలియజేశారు. దాదాపు 10 నెలలు పాటు సెకండ్ సీజన్ చిత్రీకరణ జరగనుందట. మొదటి సీజన్ కి వచ్చిన ఫేమ్ ని దృష్టిలో పెట్టుకొని, ఈ సీజన్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కాగా దాదాపు ప్రపంచం మొత్తం చూసేసిన ఈ సిరీస్ ని ఇప్పుడు రీమేక్ చేయడానికి రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ కొరియన్ సిరీస్ ని అమెరికాలో రీమేక్ చేయబోతున్నారట.

Kalyani Priyadarshan : చీరకట్టులో కళ్యాణి ప్రియదర్శన్ మెరుపులు..

ఫేమస్ అమెరికన్ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ (David Fincher) ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. డేవిడ్ డైరెక్ట్ చేసిన పలు సినిమాలు డిఫరెంట్ క్యాటగిరీస్ లో 9 ఆస్కార్ (Oscar) అవార్డులు అందుకున్నాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ డేవిడ్ తో ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయించడానికి ప్రయత్నిస్తునట్లు అమెరికన్ క్రిటిక్ అండ్ రిపోర్టర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మరి ఈ రీమేక్ ముందుకు వెళుతుందా? లేదా? చూడాలి.