Special Characters : పెరుగుతున్న స్పెషల్ క్యారెక్టర్స్.. ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..

టాలీవుడ్ లో సైతం ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది ప్రస్తుతం. మాస్ రాజ రవితేజ ఒకవైపు వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బాబీ డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటించేందుకు..............

Special Characters :  పెరుగుతున్న స్పెషల్ క్యారెక్టర్స్.. ఆసక్తి చూపిస్తున్న స్టార్ హీరోలు..

Special Characters :  పవర్ ఫుల్ మూవీ విక్రమ్ తో కమ్ బ్యాక్ ఇచ్చి, గ్రాండ్ సక్సెస్ కొట్టాడు కమల్ హాసన్. భారీ మల్టీస్టారర్ గా లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా షాక్ కు గురిచేస్తుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసి, అందరూ ఆ రోల్ గురించే మాట్లాడుకునేలా చేశాడు మరో తమిళ స్టార్ హీరో సూర్య. ఆయన పోషించిన పాత్ర రోలెక్స్. దానిచుట్టే ఈ సినిమా కథ నడుస్తుంది. అయినా, ఆ క్యారెక్టర్ నిడివి మాత్రం తక్కువ తన పరిధిలోనే పీక్స్ పెర్పామెన్స్ ఇచ్చి సూర్య ఈ సినిమా విజయంలో కీలకంగా మారిపోయారు. దాంతో విక్రమ్ సీక్వెల్ లో సూర్య ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తారని స్వయంగా కమలహాసనే ప్రకటించారు.

టాలీవుడ్ లో సైతం ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది ప్రస్తుతం. మాస్ రాజ రవితేజ ఒకవైపు వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బాబీ డైరెక్షన్ లో చిరంజీవి సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా లూసీఫర్ రీమేక్ మోహన్ రాజా డైరెక్షన్ లో చిరీంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడు.

Bollywood : ఇప్పటికైనా బాలీవుడ్ కరోనా కేర్ తీసుకుంటుందా??

ఇక మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో్ సలార్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేసి, ప్రభాస్ తో తన స్నేహాన్ని పెంచుకోవడమే కాదు, తెలుగు ఆడియన్స్ కీ దగ్గరవుతున్నాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున.. రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీలో స్పెషల్ రోల్ చేస్తుంటే, నాగచైతన్య కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో ఓ కీ క్యారెక్టర్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ సైతం సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కబీఈద్ కబీ దివాలిలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా స్టార్ హీరోలు ఫ్రెండ్షిప్ కోసం తమ స్టార్ డంను సైతం పక్కన పెట్టి మరొక స్టార్ హీరో సినిమా సక్సెస్ లో కీరోల్ ప్లే చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్ ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని స్పెషల్ క్యారెక్టర్స్ తో మరింతమంది స్టార్ హీరోలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది.