Star Hero’s Remuneration: అమాంతం రేట్ పెంచేస్తున్న స్టార్ హీరోలు?!

ఒక్క గట్టి హిట్ పడితే చాలు.. ఆమాంతం రేట్ పెంచేస్తున్నారు స్టార్స్. మార్కెట్ లో వాళ్లకున్న సత్తాకు తగ్గట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూలు టైంలో బ్లాక్ బస్టర్ కొడితేనే ఆగరు..

Star Hero’s Remuneration: అమాంతం రేట్ పెంచేస్తున్న స్టార్ హీరోలు?!

Star Hero's Remuneratio

Star Hero’s Remuneration: ఒక్క గట్టి హిట్ పడితే చాలు.. ఆమాంతం రేట్ పెంచేస్తున్నారు స్టార్స్. మార్కెట్ లో వాళ్లకున్న సత్తాకు తగ్గట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూలు టైంలో బ్లాక్ బస్టర్ కొడితేనే ఆగరు.. అలాంటిది కొవిడ్ కల్లోలంలో కోట్లు కొల్లగొట్టడం చిన్న విషయం కాదు కదా అందుకే మా రెమ్యునరేషన్ పెంచేస్తున్నాం అంటూ స్టార్స్ షాక్ ఇస్తున్నారిప్పుడు.. 150 కోట్లతో టార్గెట్ పీక్స్ కు చేర్చిన ప్రభాస్ ను ఫాలో అవుతున్నారందరూ.

Aha OTT: తెలుగు మోస్ట్ వాంటెడ్ ఓటీటీ ఆహా.. త్వరలో తమిళంలో!

స్టైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్ గా మారి పుష్పతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సౌత్ టు నార్త్ తగ్గేదే లే అన్నారు. నార్త్ లో బన్నీ ఫేం చూసి బాలీవుడ్ స్టార్స్ ముక్కున వేలెసుకుంటున్నారు. ఇకపై అల్లు అర్జున్ సినిమాలంటే పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండబోతున్నాయి. సో దానికి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు తెలుస్తోంది. పుష్ప కోసం 40 కోట్లు తీసుకున్న ఐకాన్ స్టార్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కు 60 పైనే చెప్తున్నారని అంటున్నారు. ఇంకో గట్టి సినిమా తగిలిదంటే బన్నీ 100 కోట్లను క్రాస్ చేయడం చాలా సింపుల్.

Ananya Panday: దాగనంటున్న అనన్య పాండే లేలేత అందాలు!

మొన్నటివరకు ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు డిమాండ్ చేసే రామ్ చరణ్, తారక్.. ట్రిపుల్ ఆర్ కోసం 40 వరకు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. సినిమా ప్రమోషన్స్ తోనే క్రేజ్ తెచ్చుకున్న వీళ్లు.. ట్రిపుల్ ఆర్ బొమ్మ థియేటర్స్ కొచ్చి.. బ్లాక్ బస్టర్ కొడితే.. రేట్ పెంచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ శంకర్ సినిమాకు 100 కోట్లు అందుకుంటున్నారనే న్యూస్ బయటికొచ్చింది కానీ నాకు 100 కోట్లు ఎవరిస్తారని కామెడీ చేశారు చరణ్. కానీ 100 కాకపోయినా చరణ్ రేంజ్ 60 కోట్లని తాకిందని తెలుస్తోంది.

Salman Khan: సూపర్ స్టార్స్‌నే వెయిట్ చేయిస్తున్న భాయిజాన్!

అఖండ ఇచ్చిన బూస్టప్ తో సీనియర్ స్టార్ బాలయ్య సైతం రెమ్యునరేషన్ ను పెంచారు. అఖండకు 10 కోట్లు తీసుకున్న నందమూరి నటసింహం.. ఇప్పుడు దాన్ని డబుల్ చేసినట్టు తెలుస్తోంది. యంగ్ హీరోలకు పోటీగా పారితోషకం విషయంలో దబిది దిబిడే అంటున్నారు. అటు ఆహా అన్ స్టాపబుల్ కోసం ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షలు ముట్టజెప్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్‌లకు గాను 5 నుంచి 6 కోట్ల వరకు బాలకృష్ణ వెనకేయనున్నట్లు తెలుస్తోంది.

Surbhi Jyoti: చూపులతోనే మత్తెక్కించేస్తున్న ‘నాగిని’!

టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న తమిళ్ హీరోలు సైతం రేటు పెంచి మాట్లాడుతున్నారు. కొవిడ్ ఫస్ట్ వేవ్ లో మాస్టర్ గా వచ్చిన విజయ్.. వంశీ పైడిపల్లితో సినిమాకు కమిటయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ కోసం 100 కోట్లు డీల్ చేసుకున్నాడని ఆమధ్య బాగా వార్తలొచ్చాయి. ఇక వరుణ్ డాక్టర్ తో సూపర్ హిట్ దక్కించుకున్న శివకార్తీకేయన్.. జాతిరత్నాలు అనుదీప్ తో ఈమధ్యే ఓ సినిమాను పట్టాలెక్కించాడు. ఆ ప్రాజెక్ట్ కోసం 35 కోట్ల వరకు అకౌంట్ లో వేసుకుంటున్నట్టు టాక్.