Sudeep : హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో

ఓ ఈవెంట్ లో పాల్గొన్న సుదీప్ మాట్లాడుతూ.. ''ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారు. అందులో ఒక చిన్న కరెక్షన్‌ ఉంది. హిందీ ఇకపై నేషనల్........

Sudeep : హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో

Sudeep

 

Sudeep :  ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమా అనే టాపిక్ నడుస్తుంది. అన్ని సినీ పరిశ్రమలలోని ఇదే వినిపిస్తుంది. సౌత్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఎదగడం, బాలీవుడ్ ని బీట్ చేయడంతో అంతా పాన్ ఇండియా సినిమాలంటూ సౌత్ సినిమాలని పొగుడుతున్నారు. దీంతో హిందీ సినిమా, సౌత్ సినిమా అంటూ వ్యత్యాసాలతో మాట్లాడుతున్నారు. తాజాగా వీటిపై కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌. అప్పట్నుంచి తన సినిమాలతో, పలు ఈవెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతూనే ఉన్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసి మెప్పించారు. ప్రస్తుతం సుదీప్‌ హీరోగా విక్రాంత్ రోణ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా జూలై 28న విడుదల కానుంది.

Koratala Shiva : కాజల్ ని ఆచార్య సినిమాలోంచి తీసేశాం.. ఎందుకంటే??

 

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సుదీప్ మాట్లాడుతూ.. ”ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారు. అందులో ఒక చిన్న కరెక్షన్‌ ఉంది. హిందీ ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదు. మనం పాన్ ఇండియా సినిమాలు తీయడం కాదు బాలీవుడ్‌ వాళ్లే పాన్‌ ఇండియా సినిమాలు తీస్తున్నారు. హిందీలో చేసిన సినిమాని తెలుగు, తమిళ్ అన్ని చోట్ల డబ్ చేసి రిలీజ్ చేసి పాన్ ఇండియా సినిమాలంటున్నారు. మనం సినిమాలు తీస్తున్నాం. ఎలాంటి సినిమాలంటే మనం తీసిన సినిమాలు అన్ని చోట్లకి రీచ్ అయి, అన్ని చోట్ల విజయం సాధించే సినిమాలు తీస్తున్నాం. ప్రపంచమంతా మన సినిమాలని చూస్తుంది” అని అన్నారు.

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?? అందరికి చెప్పేసిన స్నేహరెడ్డి..

దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి సుదీప్ హిందీ భాషపై, బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా హిందీ పరిశ్రమ నుంచి స్పందిస్తారేమో చూడాలి.