Sridevi Soda Center: మెగాస్టార్ విడుదల చేసిన సుధీర్ బాబు మందులోడా సాంగ్!

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కథలు, కంటెంట్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతుండడంతో మేకర్స్ కూడా ఆ విధంగానే కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లేకుండా భారీ వసూళ్లు రాబడుతుండడంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం భిన్నమైన కథల చుట్టూ తిరుగుతుంది.

Sridevi Soda Center: మెగాస్టార్ విడుదల చేసిన సుధీర్ బాబు మందులోడా సాంగ్!

Sridevi Soda Center

Sridevi Soda Center: తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కథలు, కంటెంట్ ఉన్న సినిమాలనే ఇష్టపడుతుండడంతో మేకర్స్ కూడా ఆ విధంగానే కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా.. పెద్ద సినిమా అని లేకుండా భారీ వసూళ్లు రాబడుతుండడంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం భిన్నమైన కథల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురుచూస్తున్న సుధీర్ బాబు ప‌లాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ క‌రుణ్ కుమార్ తో శ్రీదేవి సోడా సెంటర్ పేరుతో ఓ సినిమాను సిద్ధం చేశారు.

పెద్దగా ప్రచారం లేకుండానే మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే భారీ రేటుకి డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుండగా సినిమా పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు శుక్రవారం విడుదలైన మందులోడా పాట మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేస్తుంది. మ‌ణిశ‌ర్మ ట్యూన్ చేసిన ఈ మందులోడా అంటూ సాగే పాట‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వ‌డంలో మ‌ణిశ‌ర్మ‌ది ఓ ప్ర‌త్యేక‌మైన శైలి కాగా అందుకు త‌గ్గ‌ట్లుగానే ప్ర‌ముఖ లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్ మందులోడా అంటూ సాగే మాస్ తీన్ మార్ లిరిక్స్ అందించారు. దీంతో ఇప్పుడు ఈ పాట‌ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాట లిరిక‌ల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 1978 ప‌లాస దర్శకుడు ద‌ర్శ‌క‌త్వం వహించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.