Sudigali Sudheer: పెళ్లి కొడుకైన సుధీర్.. అసలు నిజమేంటంటే?

జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్..

Sudigali Sudheer: పెళ్లి కొడుకైన సుధీర్.. అసలు నిజమేంటంటే?

Sudigali Sudheer

Sudigali Sudheer: జబర్దస్త్ షోలో టీం కంటెస్టెంట్ గా వచ్చి టీం లీడర్ గా ఎదిగి తన కష్టంతో, తన ట్యాలెంట్ తో బుల్లితెర స్టార్ గా మారి ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్దస్త్ లో ఫేమ్ రావడంతో సుధీర్ కి వేరే షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఒక పక్క టీవీ షోలు, వేరే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో పక్క హీరోగానూ సినిమాలు ట్రై చేస్తున్నాడు సుధీర్.

Sudheer-Rashmi : ‘ఢీ’ షో నుంచి సుధీర్, రష్మీ అవుట్.. షో చూడం అంటున్న అభిమానులు

వెండితెరపై కూడా తన క్రేజ్ ని చూపించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్న సుడిగాలి సుధీర్ ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే.. ఏ షోలో చూసినా కామన్ గా కనిపించేది సుధీర్ ను ప్లే బాయ్ గా చూపించేస్తారు. దానికే వ్యూస్ వస్తుండడంతో సుధీర్ కూడా అలానే కంటిన్యూ అయిపోతున్నాడు. అయితే.. ఈ కామెంట్స్ కి కళ్లెం పడాలంటే సుధీర్ ఓ ఇంటి వాడలవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుంటారు. అప్ప్పుడప్పుడు సుధీర్ పెళ్లి కూడా జరిగిపోయిందని ప్రచారం కూడా చాలాసార్లే చూశాం.

Sudigali Sudheer : జబర్దస్త్‌ని వదిలేస్తున్న సుధీర్ టీం.. కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. షాక్ లో అభిమానులు..

సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటిదే ఇప్పుడు మరోసారి ప్రచారం జరుగుతుంది. తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకు సంబంధించిన కొత్త ప్రోమో విడుదలైంది. ఇందులో ఎవరో ఒక అమ్మాయితో సుడిగాలి సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ చేశారు. అందరి ముందే అతడు ఆమె చేతికి ఉంగరం తొడిగగా.. డ్రామా కంపెనీ ఆర్టిస్టులంతా కలిసి ఈ ఎంగేజ్మెంట్ చేసేశారు. దీంతో ఇది కాసేపట్లోనే వైరల్ అయిపోయింది. ఇది షో కోసం కాదని.. నిజంగానే సుధీర్ ప్రేయసిని పరిచయం చేశాడని ప్రచారం జరిగిపోతుంది. అయితే.. ఇలా ఎన్నిసార్లు పెళ్లి చేయలేదు.. ఎన్నిసార్లు ఎంగేజ్ మెంట్ చేయలేదు.. ఇది కూడా అంతేలే అని కొందరు పెదవి విరుస్తున్నారు.