Sunil : కమెడియన్, విలన్.. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్న సునీల్..

స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. తన కామెడి టైమింగ్ తో రెండు మూడు సినిమాలు హిట్స్ ఇచ్చినా కూడా...........

Sunil : కమెడియన్, విలన్.. మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్న సునీల్..

Sunil

Sunil :  స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. తన కామెడి టైమింగ్ తో రెండు మూడు సినిమాలు హిట్స్ ఇచ్చినా కూడా స్టార్ హీరోగా నిలబడలేకపోయాడు. సెటైరికల్ కామెడి టైమింగ్ తో ఒక రేంజ్ లో దూసుకపోయిన స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా మాత్రం తన కెరీర్ లో అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న లాంటి సినిమాలతో సక్సెస్ అయినా ఫెయిల్యూర్స్ రేషియోనే ఎక్కువగా ఉంది. కమెడియన్ లైన్ ను క్రాస్ చేసి, స్టార్ హీరో రేంజ్ సక్సెస్ ను చూడలేకపోయాడు సునీల్. మరిప్పుడు కామెడితో పాటు విలన్ గానూ నటిస్తున్న సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవబోతున్నాడా అని అంతా అనుకుంటున్నారు.

కలర్ ఫోటో సినిమాతో విలన్ క్యారెక్టర్ గానూ సునీల్ ను రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సుకుమార్ కూడా పుష్ప సినిమాలో విలన్ గా సునీల్ కి ఛాన్స్ ఇచ్చి మరోసారి సునీల్ విలనిజాన్ని బయటకు తీశారు. దాంతో సునీల్ కమెడియన్, హీరోగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వరస ఆఫర్స్ తో బిజీ అయిపోయాడు. తాజాగా F3లో మరోసారి వరుణ్ తేజ్ పక్కన తన మార్క్ టైమింగ్ తో కామెడి పండించాడు సునీల్. రామ్ చరణ్, శంకర్ కాంబినేష్ లో వస్తోన్న సినిమాలో చరణ్ పక్కన మరో మంచి క్యారెక్టర్ లో నటించి, కామెడి పండించబోతున్నాడు. ఇక పుష్పలో విలన్ గా మెప్పించిన సునీల్ పుష్ప 2లో తన విలనిజం మరో లెవల్ లో ఉండబోతుంది అంటున్నాడు.

Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో 100 కోట్ల సినిమా..

 

దీంతో సునీల్ కి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు బాగానే వస్తున్నాయి. సునీల్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారా అని ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తుంటే ఆల్రెడీ సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకుని వరస ఆఫర్స్ తో కెరీర్ లో మళ్ళీ బిజీ అయిపోయాడు అని అంటున్నారు.