రజినీకాంత్ హెల్త్ బులెటిన్..

రజినీకాంత్ హెల్త్ బులెటిన్..

SuperStar Rajinikanth Health Bulletin: సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీ కాంత్ తీవ్ర అస్వస్థతో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. హైబీపీతో కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. హాస్పిటల్ యాజమాన్యం శనివారం ఉదయం రజినీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

హైబీపీతో బాధపడుతున్న రజినీకి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశముందని తెలిపారు. కేవలం ఒక డాక్టర్ పర్యవేక్షణలో రజినీ సెల్ఫ్ ఇసోలేషన్లో ఉన్నారు. రజినీ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

Rajinikanth

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రజినీ ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే చెన్నై నుంచి రజినీ వ్యక్తిగత వైద్యులు అపోలోకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రజినీను కలిసేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నాలు చేశారు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడంతో ఎవ్వరినీ రావొద్దని, చివరకు పెద్ద కుమార్తె ఐశ్వర్యను సైతం రూం వద్దకు రావొద్దని చెప్పారు.

కాగా శివ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రొడక్షన్ టీం లో 8 మందికి కరోనా సోకడంతో చిత్రీకరణ వాయిదా వేశారు. రజినీకి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్థారణ అయింది.