Salman Khan: సూపర్ స్టార్స్‌నే వెయిట్ చేయిస్తున్న భాయిజాన్!

సూపర్ స్టార్స్‌ని వెయిట్ చేయిస్తున్నాడు కండల వీరుడు. ఇటు సల్మాన్ కోసం చిరూ ఎదురుచూస్తుంటే.. అటు ఎప్పుడెప్పుడా అని షారుఖ్ కాచుక్కూర్చున్నాడు. స్పెషల్ గా ఈ హీరో కోసం షెడ్యూల్స్..

Salman Khan: సూపర్ స్టార్స్‌నే వెయిట్ చేయిస్తున్న భాయిజాన్!

Salman

Salman Khan: సూపర్ స్టార్స్‌ని వెయిట్ చేయిస్తున్నాడు కండల వీరుడు. ఇటు సల్మాన్ కోసం చిరూ ఎదురుచూస్తుంటే.. అటు ఎప్పుడెప్పుడా అని షారుఖ్ కాచుక్కూర్చున్నాడు. స్పెషల్ గా ఈ హీరో కోసం షెడ్యూల్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరి కొవిడ్ సల్మాన్ ను రానిస్తుందా… ఈ పెద్ద హీరోల పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తిగా మారింది.

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

కండల వీరుడి కోసం ఎదురుచూస్తున్నాడు గాడ్ ఫాదర్. సంక్రాంతి తర్వాత ఈమూవీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులోనే సపరేట్ సీన్స్ తో పాటూ చిరూతో కాంబినేషన్ సీన్స్ చేయాల్సి ఉంది సల్మాన్. గతంలోనే జనవరికి సంబంధించిన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేశారు కూడా. తీరాచూస్తే మళ్లీ కరోనా కమ్మేస్తుండటంతో షూట్ పోస్ట్ పోన్ కానుందనే హింట్స్ అందుతున్నాయి. ప్రస్తుతానికైతే క్యాన్సిల్ అని అఫీషియల్ గా అనుకోలేదు. కానీ సల్మాన్ రిస్క్ తీసుకొని వస్తారా అన్నది క్వశ్చన్. అయితే సల్మాన్ లేకుండా గాడ్ ఫాదర్ కొత్త షెడ్యూల్ ను చిరూ ముందుకు తీసుకెళ్లలేరన్నది నిజం.

Chiru 154: చిరుకి తమ్ముడిగా మాస్ రాజా.. బర్త్ డే రోజు ప్రకటన!

నిజంగానే మోస్ట్ వాంటేడ్ అయి కూర్చున్నాడు సల్మాన్ ఖాన్. ఫటాఫట్ షూటింగ్స్ కానిచ్చేస్తున్న మెగాస్టార్ నే వెయిట్ చేయిస్తున్నాడు. లూసిఫర్ మూవీలో పృథ్వీరాజ్ చేసిన రోల్ చేస్తున్న సల్మాన్ చిరూతో కలిసి ఫైట్ సీన్ ఇంకా సాంగ్ కూడా చేయాల్సి ఉంది. అటు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ కోసం కూడా వర్క్ కమిట్మెంట్ ఇచ్చాడు బాలీవుడ్ భాయ్. ఫిబ్రవరిలో షారుఖ్, సల్మాన్ కాంబో సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది. బట్ చూస్తుంటే అదీ సరైన టైమ్ కి పూర్తయ్యేలా పరిస్థితులు మారేలా లేవు.

Arjun-Malaika: అర్జున్-మలైకా బ్రేకప్.. ఏంటి హాట్ కపుల్ విడిపోతున్నారా?

వరాలిచ్చే బాబాగా తయారయ్యాడు సల్మాన్ ఖాన్. ఫ్రెండ్స్ కోసం స్పెషల్ రోల్స్ చేసేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. బావ కోసం అంతిమ్ ది ఫైనల్ ట్రూత్ చేశాడు. ఆమీర్ లాల్ సింగ్ చద్దాలో ఆల్రెడీ కామియో సీన్స్ కంప్లీట్ చేశాడు. చిరూ గాడ్ ఫాదర్, షారుఖ్ పఠాన్ సినిమాలు సల్మాన్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాయి. అటు తన సూపర్ హిట్ ఫ్రాంచైజ్ మూవీ టైగర్ 3 సెట్స్ పై ఉంది. మరోవైపు కొత్త సినిమాలను సెట్ చేస్తున్నాడు. రీసెంట్ గా సల్మాన్ కోసం పవన్ పుత్ర భాయిజాన్ కథ రెడీ చేస్తున్నట్టు విజయేంద్రప్రసాద్ కూడా చెప్పేశారు.