Swapna Dutt : మా బ్యానర్ లో నటించిన వాళ్లంతా స్టార్స్ అవుతున్నారు.. ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ..

తాజాగా చిత్రయూనిట్ అన్ని మంచి శకునములే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, ప్రియాంక దత్, స్వప్న దత్.. చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.

Swapna Dutt : మా బ్యానర్ లో నటించిన వాళ్లంతా స్టార్స్ అవుతున్నారు.. ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ..

Swapna Dutt Speech at Anni Manchi Shakunamule Movie Success Meet

Anni Manchi Shakunamule : సంతోష్ శోభన్(Santosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమ్మర్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చారు చిత్రయూనిట్. స్వప్న సినిమాస్ లాంటి పెద్ద ప్రొడక్షన్ కావడంతో సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. ఇక ఈ సినిమాని కొంతమంది బాగుంది అంటే, కొంతమంది యావరేజ్ అని అంటున్నారు.

తాజాగా చిత్రయూనిట్ అన్ని మంచి శకునములే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నందిని రెడ్డి, ప్రియాంక దత్, స్వప్న దత్.. చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.. ఫ్యామిలీలంతా థియేటర్స్ కి వెళ్తున్నారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలు అంతా కలిసి ఒక సినిమాకు వెళ్తున్నారు. పాత సినిమాల్లాగే ఈ సినిమా చాలా మంచి సినిమా అని తెలిపారు.

Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..

నిర్మాత స్వప్నాదత్ మాట్లాడుతూ.. ఈ సినిమా డబ్బుల కోసం చేయలేదు. అలాగని సినిమా తీసి వదిలేయలేదు. థియేటర్స్ కి వెళ్లి ప్రేక్షకులు స్పందనల కోసం చూశాం. నేను, ప్రియాంక, నాగి, చిత్రయూనిట్ అంతా థియేటర్స్ కి వెళ్లి సినిమాను చూశాం. మా గత సినిమాలు అన్ని అందరూ సూపర్ అన్నారు. కానీ ఈ సినిమా కొంతమంది క్రిటిక్స్ కి నచ్చలేదు. చాలా మంది ప్రేక్షకులకు నచ్చింది. ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ వీళ్లంతా మా సంస్థ నుంచే మొదలయి అనంతరం స్టార్స్ అయ్యారు. రేపు సంతోష్ కూడా ఒక రెండేళ్ల తర్వాత కచ్చితంగా స్టార్ అవుతాడు. ఇది ఒక మంచి సినిమా అని గట్టిగా నమ్మాము. ఇన్ని రోజులు మేము తీసిన సినిమాలు అందరూ హిట్ అని చెప్పారు. కానీ దీనికి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అయినా ఈ సినిమా తీసినందుకు మేము చాలా గర్విస్తున్నాం అని తెలిపింది.