Swathimuthyam: ఆహా.. స్వాతిముత్యం నాలుగు రోజుల ముందే దిగుతున్నాడుగా!
యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటించిన తాజా చిత్రం ‘స్వాతిముత్యం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 5న ఈ సినిమాను మరో రెండు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Swathimuthyam: యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటించిన తాజా చిత్రం ‘స్వాతిముత్యం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించగా, ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 5న ఈ సినిమాను మరో రెండు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
Swathimuthyam: సెన్సార్ పనులు ముగించేసుకున్న ‘స్వాతిముత్యం’
గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలకు పోటీగా స్వాతిముత్యం చిత్రం రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. అయితే కంటెంట్ బాగుండటంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. దీంతో ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జోడీ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. కాగా, ఈ సినిమాను డిజిటల్ ప్రీమియర్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్కు రెడీ చేస్తున్నారు నిర్వాహకులు.
తొలుత ఈ సినిమాను అక్టోబర్ 28న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆహా నిర్వాహకులు, ఇప్పుడు ఈ సినిమాను నాలుగు రోజులు ముందుగా.. అక్టోబర్ 24న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ఈ స్వాతిముత్యం డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.