Movie Shooting: ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే?

శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య.. ఫిల్మ్ సిటీలో మహేశ్ బాబు బిజీ.. అల్యుమినియం ఫ్యాక్టరీలో బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154 సినిమా షూటింగ్ నడుస్తోంది. నాగార్జున దుబాయ్ లో..

Movie Shooting: ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుందంటే?

Movie Shooting

Movie Shooting: శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య.. ఫిల్మ్ సిటీలో మహేశ్ బాబు బిజీ.. అల్యుమినియం ఫ్యాక్టరీలో బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154 సినిమా షూటింగ్ నడుస్తోంది. నాగార్జున దుబాయ్ లో, రవితేజ స్పెయిన్ లో హడావిడి చేస్తుంటే, హైదరాబాద్ లో నాని, నితిన్ ఇలా స్టార్స్ అంతా ఎవరి షూటింగ్స్ లో వాళ్లు బిజీబిజీగా ఉన్నారు. ఎవరేం సినిమా షూటింగ్ లో ఎక్కడున్నారో ఓసారి చూద్దాం.

NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

స్టార్స్ అంతా షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. బాబీ డైరెక్షన్ లో చిరు 154 సినిమా షూటింగ్ అల్యూమినియం ఫాక్టరీలో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మహేశ్ బాబు, పరుశురాం డైరెక్షన్ లో నటిస్తున్నాడు. త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి, ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలనే లక్ష్యంతో సర్కార్ వారి పాట షూటింగ్ శరవేగంగా చేస్తున్నాడు సూపర్ స్టార్.

Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

ఇక రవితేజ, వేణు తొట్టంపూడి నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా స్పెయిన్ లో జరుగుతుంది. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు నటిస్తున్నారు. నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతున్న ది ఘోస్ట్ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయన్స్ పై రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!

నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నాని దసరా సినిమా సినిమా కోసం యాక్టివ్ గా వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్, కృతిశెట్టి హీరో హీరోయిన్స్ గా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది.