Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫోకస్ అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్... దీంతో డిజిటల్ ప్లాట్ ఫాం పై వాళ్ల స్టామినా అల్టిమేట్ అనిపించుకుంటోంది. రీసెంట్గా సోషల్ మీడియా పాపులారిటీ..

Telugu Star Hero’s: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు హీరోలు!

Telugu Star Hero's

Telugu Star Hero’s: పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫోకస్ అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్… దీంతో డిజిటల్ ప్లాట్ ఫాం పై వాళ్ల స్టామినా అల్టిమేట్ అనిపించుకుంటోంది. రీసెంట్గా సోషల్ మీడియా పాపులారిటీ ప్రకారం టాప్ 10 టాప్ హీరోల లిస్ట్ ఒకటి బయటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే మన సూపర్ స్టార్ కున్న స్టార్ డం ఎలాంటిదో తెలుస్తుంది. ఇప్పుడంతా సోషల్ మీడియాదే హవా… సోషలో మీడియాలోనే హవా. సినిమా ప్రమోషన్స్ దగ్గరి నుంచి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వరకు… మాక్సిమం మూమెంట్స్ ను ఇక్కడే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు స్టార్స్.

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

ఈ లెక్కలో సోషల్ మీడియా క్రేజీ హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ మహేశ్ బాబుది. సర్కారు వారి పాట అప్ డేట్స్ తో ఫ్యాన్స్ చేసిన ట్రెండింగ్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది. టీజర్ వచ్చిన తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక మహేశ్ కి సంబంధించిన షూటింగ్ అప్ డేట్స్, ఫ్యామిలీ ట్రిప్స్.. అన్నీ ఎప్పటికప్పుడు సోషల్ అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉండటమే సూపర్ స్టార్ ని టాప్ 1 ఛైర్ లో కూర్చోబెట్టింది.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

పుష్పరాజ్ గా హల్చల్ చేస్తోన్న బన్నీ సోషల్ మీడియా టాప్ 10 లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. పుష్ప సినిమా వరుస అప్ డేట్స్, షూటింగ్ డిటేల్స్, వేరే హీరోల ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటూ ఫ్యామిలీతో కలిసి పోస్ట్ చేసే ఫన్నీ వీడియోల కారణంగానే అల్లు అర్జున్ కి ఇంత పాపులారిటీ. గ్లోబల్ స్టార్ ప్రభాస్..ఈ విషయంలో మూడో ప్లేస్ లో ఉన్నారు. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ సాధిస్తున్నా.. డార్లింగ్ కాస్త వెనుకబడడానికి రీజన్ పర్సనల్ విషయాలు పోస్ట్ చేయకపోవడమే. అలాగే ప్రభాస్ సినిమాల నుంచి వెంటవెంటనే అప్ డేట్స్, టీజర్స్, సింగిల్స్ లాంటివి కూడా రాకపోవడంతో సోషల్ మీడియాలో మాత్రం బన్నీ తర్వాతే ప్రభాస్ అంటున్నారు.

Preity Zinta: 46 ఏళ్లకు కవలలకు తల్లైన సొట్టబుగ్గల సుందరి!

సంక్రాంతికి పక్కాగా వస్తానని తేల్చేసిన భీమ్లానాయక్ మూవీతో ఫోర్త్ ప్లేస్ కొచ్చారు పవర్ స్టార్. ఈ సినిమాతో పాటూ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన చిన్న విషయాన్నైనా ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు పవర్ ఫ్యాన్స్. ఇక పాలిటిక్స్ సరేసరి. అందుకే పవన్ ఫోర్త్ స్పాట్ లో ఫోజులిస్తున్నారు. బాక్సాఫీస్ పై పంజా విసిరే తారక్ సోషల్ మీడియా రేస్ లో ఐదో స్థానంలో నిలిచారు. పర్సనల్ ఇంటరాక్షన్ కు కాస్త దూరంగానే ఉండే తారక్.. ట్రిపుల్ ఆర్ తో పాటూ రాబోయే సినిమాల వార్తలతో హైలెట్ అవుతున్నారు.

RRR : ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. 50 రోజుల్లో

సోషల్ అప్డేట్స్ పరంగా టాప్ 6 ప్లేస్.. రామ్ చరణ్ ది. ఆచార్య, ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ వీడియోస్ తో పాటూ మెగా ఫ్యామిలీ ఈవెంట్స్, ఫంక్షన్స్ తో ట్రెండ్ అవుతుంటారు చరణ్. అలాగే ఉపాసన కూడా చెర్రీ విషయాలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది. రామ్ చరణ్ తర్వాత వరుసగా నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు టాప్ 10 పొజిషన్స్ ను సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని చై.. విడాకుల ఇష్యూతో ట్రెండ్ అవుతుంటే.. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలను షురూ చేస్తూ చిరూ పదో స్థానాన్ని ఆక్రమించారు.