The Baker And The Beauty : ‘ఆహా’ లో మరో డిఫరెంట్ ఒరిజినల్

రొమాన్స్, ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ‘ది బేకర్ & ది బ్యూటీ’ వెబ్ సిరీస్‌ వినాయక చవితి స్పెషల్‌గా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది..

The Baker And The Beauty : ‘ఆహా’ లో మరో డిఫరెంట్ ఒరిజినల్

The Baker And The Beauty

The Baker And The Beauty: తెలుగు ప్రేక్షకులకు ప్రామిస్ చేసినట్లు సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే సిరీస్‌లు, ఎనర్జిటిక్ టాక్ షో లతో 100 శాతం వినోదాన్ని అందిస్తూ.. డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది.. తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. ఇప్పుడు తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజిన‌ల్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 10న ప్ర‌సారం చేయ‌నుంది. ‘ఆహా కిడ్స్’ ద్వారా మ‌న పురాణ క‌థ‌లు, విలువ‌లును తెలియ‌జేసేలా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను ఈత‌రం చిన్నారుల‌కు అందిస్తోంది.

Aha: వినాయ‌క చ‌వితి స్పెషల్, ఆహాలో చిన్నారుల కోసం ఫస్ట్ కిడ్స్ యానిమేటెడ్ ‘మహా గణేశ’!

అలాగే వినాయక చవితికి తెలుగు ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది ‘ఆహా’.. ఆడియెన్స్‌‌కి ఒరిజినల్ కంటెంట్‌ని అందించడానికి ముందుండే ‘ఆహా’ ఇప్పుడు ‘ది బేకర్ & ది బ్యూటీ’ అనే వెబ్ సిరీస్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ చెయ్యబోతోంది.

Aha : ‘ఆహా’ లో ఆగస్టు 28న ‘SR కళ్యాణ మండపం’..

అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి ‘ఆహా’ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ను ‘అమరం అఖిలం ప్రేమ’ ఫేమ్ జొనాథన్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశారు. రొమాన్స్, ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్ మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్నారు. ఈ సిరీస్‌తో సంతోష్ శోభన్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Aha Bhojanambu : ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’.. మంచు లక్ష్మీతో ముచ్చట్లు..

రీసెంట్‌గా పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇందులో నటిస్తున్నట్లు ఆమె క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘ఈ విజ్జు గాడు నాకు ప్రపోజ్ చేస్తాడా, లేదా..?’ అనే కన్ఫ్యూజన్‌తో ‘మహి’ ఉన్నట్లు చూపించారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి ‘ఆహా’ లో ‘ది బేకర్ & ది బ్యూటీ’ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Chatur Mukham : ‘ఆహా’ లో మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’..

‘ఆహా’ రీసెంట్‌గా ‘తరగతి గది దాటి’ అనే క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరిని ప్రేక్షకులకు అందించింది.. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన‌ అద్భుత‌మైన సైఫై థ్రిల్ల‌ర్ ‘కుడి ఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘క్రాక్‌’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’,‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘నాంది’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’, ‘నీడ‌’, ‘కాలా’, ‘ఆహా భోజ‌నంబు’, ‘వ‌న్‌’, ‘చతుర్‌ ముఖం’, ‘SR కళ్యాణమండపం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, వెబ్ షోస్‌ను 2021లో ప్రేక్ష‌కుల‌కు అందించింది ‘ఆహా’.

Tharagathi Gadhi Daati : ‘ఆహా’ లో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’..