The Warrior: ది వారియర్ 4 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’పై మొదట్నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి.....

The Warrior: ది వారియర్ 4 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

The Warrior 4 Days Worldwide Collections

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’పై మొదట్నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జూలై 14న రిలీజ్ చేశారు.

The Warrior: ‘ది వారియర్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు!

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో రామ్ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రామ్, తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాలో రొటీన్ కథ ఉండటంతో ఈ సినిమాకు రిలీజ్ రోజునే డివైడ్ టాక్ వచ్చింది. కానీ తొలిరోజున కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి.

The Warrior: ‘ది వారియర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

అయితే ఈ జోరు మిగతా రోజుల్లో ఏమాత్రం కనిపించలేదనే చెప్పాలి. వీకెండ్ అయినా కూడా ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. దీంతో ఈ సినిమా నాలుగు రోజులు ముగిసే సరికి చాలా డల్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా 4 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.16.76 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర 4 రోజుల వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.71 కోట్లు
సీడెడ్ – 2.56 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.06 కోట్లు
ఈస్ట్ – 1.12 కోట్లు
వెస్ట్ – 1.03 కోట్లు
గుంటూరు – 1.76 కోట్లు
కృష్ణా – 0.80 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 14.59 కోట్లు (రూ.22.45 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.80 కోట్లు
ఓవర్సీస్ – 0.55 కోట్లు
తమిళ్ – 0.82 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.16.76 కోట్లు (రూ.28 కోట్ల గ్రాస్)