RRR : ఒక పక్క ఆస్కార్ నామినేషన్స్.. మరో పక్క అమెరికాలో రీ రిలీజ్..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని భారతీయులు కంటే విదేశీలు ఎక్కువ ఆదరించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా తరగని క్రేజ్ ని చూసిన ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'వేరియన్స్ ఫిలిమ్స్' ఆర్ఆర్ఆర్ ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

RRR : ఒక పక్క ఆస్కార్ నామినేషన్స్.. మరో పక్క అమెరికాలో రీ రిలీజ్..

rrr re release

RRR : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టిస్టార్రర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని భారతీయులు కంటే విదేశీలు ఎక్కువ ఆదరించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆస్కార్ అవార్డ్స్ కి RRR ని మన వాళ్ళు గుర్తించకపోయినా, అమెరికన్స్ మాత్రం ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ చేయాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి అభిమానం పొందిన ఈ చిత్రం ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Netflix : RRR సినిమా మాకు ఉపయోగపడింది.. కానీ.. ఇండియన్ సినిమాలపై నెట్ ఫ్లిక్స్ కామెంట్స్..

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావొస్తున్నా క్రేజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ఇటీవల ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ ఐమాక్స్ లో షో ప్రదర్శించగా.. ఆ షో టికెట్స్ కేవలం 98 సెకన్స్ లో అమ్ముడు పోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా తరగని క్రేజ్ ని చూసిన ప్రముఖ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘వేరియన్స్ ఫిలిమ్స్’ ఆర్ఆర్ఆర్ ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది.

‘RRR ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచినా, నిలవకపోయినా.. ఈ చిత్రాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకు వస్తాము. ఈ ఫిబ్రవరిలో ఆర్ఆర్ఆర్ ని యూఎస్ లో నేషనల్ వైడ్ భారీగా రీ రిలీజ్ చేస్తున్నాము. మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అలాగే కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో మళ్ళీ రీ రిలీజ్ చేస్తునందుకు అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా నేడు ఆస్కార్ నామినేషన్ లిస్ట్ విడుదల కానుంది. ఈ లిస్ట్ లో RRR ఉంటుందా? లేదా? అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ నామినేషన్ లిస్ట్ ఈరోజు సాయంత్రం గం.7:00 గంటలకు ప్రకటించనున్నారు.