Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు

ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్యనున్న ఈ వెబ్ సిరీస్ ల క్రేజ్ ను కొనసాగించేలా కొత్త వెబ్ సిరీస్, కొన్నిటికి కొనసాగింపు సిరీస్ లు త్వరలో ఓటీటీలలో విడుదల కానున్నాయి.

Upcoming Web-Series: ఓటీటీల్లో త్వరలో రానున్న వెబ్ సిరీస్ లు

Ott

Upcoming Web-Series: కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ ప్రేక్షకులు ఉసూరుమన్నారు. అయితే ఓటిటీల రూపంలో కొంతమేర ఊరట కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే కరోనా లాక్ డౌన్ ఓటీటీల పాలిట వరంగా మారింది. లాక్ డౌన్ తో ఇళ్లకే అతుక్కుపోయిన ప్రజలు, ఓటీటీలలో వచ్చిన అన్ని చిత్రాలను, సిరీస్ లను భాషాబేధంలేకుండా చూసేసారు. ఓటిటీ సంస్థలు సైతం ప్రేక్షకుల నాడీ పట్టలేక అందిన భాషల్లో హిట్ అయిన సినిమాలను, వెబ్ సిరీస్ లను ప్రాంతీయ భాషల్లోకి విడుదల చేసాయి. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్యనున్న ఈ వెబ్ సిరీస్ ల క్రేజ్ ను కొనసాగించేలా కొత్త వెబ్ సిరీస్, కొన్నిటికి కొనసాగింపు సిరీస్ లు త్వరలో ఓటీటీలలో విడుదల కానున్నాయి.
Human: హాట్ స్టార్ స్పెషల్ గా వస్తున్న ఈ “HUMAN” సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో.. రూపొందించిన ఈ “HUMAN” వెబ్ సిరీస్ లో షెఫాలీ షా మరియు కీర్తి కుల్హారీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ కి సంబంధించి ఇటీవలే విడుదలైన రెండు టీజర్లను చూస్తే.. క్రైమ్, థ్రిల్లర్, డ్రామా ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి హిందీలోనే విడుదల కానున్న ఈ “HUMAN” వెబ్ సిరీస్ లో.. సీమా బిస్వాస్, రామ్ కపూర్ మరియు సందీప్ కులకర్ణి వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు.

Also Read: I-T raids on Xiaomi, Oppo: షియోమీ, ఒప్పో కంపెనీలపై రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశం

Detective Boomrah: పేరులోనే డిటెక్టివ్ గా వస్తున్న ఈ సిరీస్ పైనా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. సిరీస్ కంటే ముందు ఈకథ.. రేడియోల్లోనూ, వెబ్ క్యాస్ట్, పోడ్ క్యాస్ట్ ల్లోనూ బాగా పాపులర్ అయింది. దీంతో “డిటెక్టివ్ బుమ్రా” సిరీస్ పై మంచి అంచనాలు ఉన్నాయి. సిరీస్ కు దర్శకత్వం వహించిన సుధాన్షు రాయ్ లీడ్ యాక్టర్ గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. Detective Boomrah సిరీస్ ను జనవరి 21న యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు.

Hotspot Mail Trail: ఉల్లూ ఒరిజినల్స్(ULLU ORIGINALS)లో వస్తున్న “హాట్ స్పాట్ మెయిల్ ట్రైల్” వెబ్ సిరీస్ ప్రేక్షకుల దృష్టిని తాకింది. ఎందుకంటే ఈ సిరీస్ లో ప్రధాన పాత్రగా నటిస్తున్న అర్షి ఖాన్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న వక్వార్ షేక్, హిందీలో చిత్ర పరిశ్రమలో టీవీ పరిశ్రమలోనూ మంచి గుర్తింపు ఉంది. దీంతో వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ Hotspot Mail Trail సిరీస్ పై అంచనాలు నెలకొన్నాయి.

Also read: Greyhounds Land Scam : రూ.10వేల కోట్ల విలువైన భూములను కాపాడిన 10TV.. ప్రభుత్వం అభినందనలు

Jamtara: నెట్ ఫ్లిక్స్(NETFLIX) లో విడుదలై, మంచి వ్యూస్ రాబట్టిన “Jamtara” మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తున్నా “Jamtara: Season 2” పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక చిన్న గ్రామంలో పలువురు యువకులు చేసే టెలికాలర్ మోసాలు, ఆన్ లైన్ మోసాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ “Jamtara” వెబ్ సిరీస్ రూపొందించారు. మొదటి సీజన్లో నటించిన నటులు కూడా రెండో భాగంలో కొనసాగనున్నారు.
భాషాబేధం లేకుండా అన్ని బాషా చిత్రాలను సిరీస్ లను ఆదరిస్తున్న ప్రేక్షకులకు.. త్వరలో రానున్న ఈ సిరీస్ లు వినోదాన్ని పంచుతాయనే సందేహంలేదు

Also read: China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా