Varisu: ‘వారిసు’ అల్టిమేట్ రికార్డు.. 250 కోట్లతో దుమ్ములేపిన విజయ్!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ రిలీజ్‌కు ముందే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఇటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా, పొంగల్ కానుకగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Varisu: ‘వారిసు’ అల్టిమేట్ రికార్డు.. 250 కోట్లతో దుమ్ములేపిన విజయ్!

Varisu Sensation With Rs.250 Crores Collections

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ రిలీజ్‌కు ముందే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఇటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలు అమాంతం పెంచేశాయి. కాగా, పొంగల్ కానుకగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Varisu : రంజితమే సాంగ్‌కి దిల్ రాజు మనవరాలు డాన్స్.. ఫిదా అయిన విజయ్!

తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ వారిసు చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమాకు అన్ని చోట్లా కళ్లు చెదిరే వసూళ్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా వసూళ్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. వారిసు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

Varisu: వారిసు సినిమాలో ఆ హీరోయిన్‌ను లేపేశారా..?

విజయ్ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా వారిసు నిలిచిందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసిందని.. ఇక సినిమాలోని ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెబుతోంది. థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇచ్చిందని.. పాటలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, అందాల భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.