Michael : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో వరుణ్‌సందేశ్..

సింగిల్ హీరోగా చేస్తుంటే విజయాలు దక్కకపోవడంతో ఇక మల్టీస్టారర్ కానీ, స్పెషల్ రోల్స్ కానీ చేయాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ సందేశ్. తాజాగా రూటు మార్చి ఓ యాక్షన్‌ సినిమాకు................

Michael : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో వరుణ్‌సందేశ్..

Varun Sandesh

Varnu Sandesh :  హ్యాపీడేస్‌, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో ప్రేక్షకులని మెప్పించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత వరుస సినిమాలు తీసినా మధ్యలో కొన్ని సినిమాలు తప్ప మిగిలినవి ఏవి అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇచ్చి ఇటీవల ‘ఇందువదన’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అయినా ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. వరుణ్ చాలా కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

 

సింగిల్ హీరోగా చేస్తుంటే విజయాలు దక్కకపోవడంతో ఇక మల్టీస్టారర్ కానీ, స్పెషల్ రోల్స్ కానీ చేయాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ సందేశ్. తాజాగా రూటు మార్చి ఓ యాక్షన్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు వరుణ్. అది కూడా పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. సందీప్‌ కిషన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మైఖేల్‌’ సినిమాలో వరుణ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి గతంలోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాలో నటించారు.

Nayanathara : నుదుటి మీద కుంకుమ.. నయనతార పెళ్ళైపోయిందని వార్తలు..

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. తాజాగా వరుణ్ సందేశ్ ఫోటోని షేర్ చేస్తూ వరుణ్ రెగ్యులర్ షూటింగ్ లో మాతో జాయిన్ అవ్వనున్నాడు అంటూ పోస్ట్ చేశారు. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్ స్పెషల్ క్యారెక్టర్ చేయనున్నాడు. మరి ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మైఖేల్’ విడుదల కానుంది. అయితే వీరిద్దరూ కలిసి గతంలోనే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాలో నటించారు. గత కొంతకాలంగా సందీప్‌కి కూడా ఆశించిన విజయాలు లేవు మరి ఇలాంటి టైంలో ఈ సినిమా అయినా వరుణ్ సందేశ్‌కి, సందీప్ కిషన్‌కి విజయం చేకురుస్తుందో చూడాలి.