F3 Movie : కేబుల్ బ్రిడ్జిపై వెంకటేష్, వరుణ్ తేజ్ సందడి

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దర్శకుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

F3 Movie : కేబుల్ బ్రిడ్జిపై వెంకటేష్, వరుణ్ తేజ్ సందడి

F3 Movie

F3 Movie : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దర్శకుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలోనే “ఎఫ్ 3” రిలీజ్ డేట్ ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి :  Natyam Movie : ఇండస్ట్రీ టాప్ పీఆర్వోలు వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘నాట్యం’ డైరెక్టర్

గురువారం దీపావళి కావడంతో ఈ చిత్రం నుంచి ఓ వీడియో విడుదల చేశారు. కేబుల్ బ్రిడ్జిపై వెంకీ, వ‌రుణ్ బాణా సంచా కాల్చుతూ ఎఫ్ 3 చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కానుంద‌ని తెలియజేశారు. ఇక ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్ 3లో మరింత కామెడీ ఉండేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేశారట.

చదవండి : F3 Movie : మహా శివరాత్రికి నవ్వించడానికి వస్తున్న ‘ఎఫ్ 3’

కాగా ఎఫ్ 2 మూవీ 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా ఆ సినిమా దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఎఫ్-3 చిత్ర నిర్మాణానికి 80 కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా సమాచారం.