Vijay – Rashmika : దుబాయ్ టూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!

ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు.

Vijay – Rashmika : దుబాయ్ టూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!

vijay devarakonda and rashmika mandanna

Vijay – Rashmika : ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. ఇటీవలే వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లారంటూ, సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో విపరీతంగా కథనాలు వచ్చాయి. వీటి పై రష్మిక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కౌంటర్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ, తను మంచి ఫ్రెండ్స్ అని, స్నేహితులు కలిసి టూర్స్ కి వెళ్ళారా? అయినా మా రిలేషన్‌షిప్ గురించి మేము ఎందుకు అబద్ధం చెప్పాలి? అంటూ కౌంటర్ ఇచ్చింది.

Vijay-Rashmika: డేటింగ్‭లో ఉన్న విజయ-రష్మిక.. మాల్దీవులు టూర్‭లో జంట!

తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు. విజయ్ దేవరకొండతో సెల్ఫీ దిగడానికి ఒక అభిమాని ట్రై చేస్తుంటే మధ్యలో రష్మిక కూడా ఆ ఫొటోలో కనిపించేలా పోజ్ ఇస్తున్న ఒక ఫోటో బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరూ దుబాయ్ కి ఏ పని మీద వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరిద్దరి సినిమాలు విషయానికి వస్తే.. రష్మిక ఇటీవలే పుష్ప-2 షూటింగ్ లో పాల్గొంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్.. ప్రస్తుతం పాట చిత్రీకరణ చేస్తున్నట్లు సమాచారం.

ఇక విజయ్ ఇప్పటికే మొదలు పెట్టిన ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎదురు చూస్తూనే, మరో పక్క తన 12వ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఖుషి టాకీ పార్ట్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో గౌతమ్ తిన్ననూరి సినిమాలో పాల్గొనున్నాడు. కాగా సమంత ఆరోగ్య కోలుకోవడంతో త్వరలోనే ఖుషి షూటింగ్ మొదలు కాబోతుంది అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశాడు.