Unstoppable with NBK : ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్‌ ‘అర్జున్‌ రెడ్డి’

‘అన్ స్టాపబుల్ విత్ NBK’ తొమ్మిదవ ఎపిసోడ్ లో లైగర్ సినిమా టీం గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ షోకి పూరి జగన్నాధ్, ఛార్మి, విజయ్ దేవరకొండ వచ్చారు

Unstoppable with NBK : ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్‌ ‘అర్జున్‌ రెడ్డి’

Unstoppable With Nbk

Balakrishna :   బాలకృష్ణ యాంకర్ గా మొదలు పెట్టిన షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుంది. సినీ సెలబ్రిటీలని తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళ లైఫ్ లోని చాలా మూమెంట్స్ ని ప్రేక్షకులకి తెలియచేస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి భారీ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులే కాక ప్రేక్షకులంతా బాలయ్యని ఈ షో హోస్టింగ్ అదరగొట్టేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే ఐఎండిబిలో టాప్ 10 షోలలో ఈ షో స్థానం సంపాదించింది.

ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ 10వ ఎపిసోడ్ లో మహేష్ బాబు వస్తారని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా తొమ్మిదవ ఎపిసోడ్ ని సంక్రాంతి స్పెషల్ గా టెలికాస్ట్ చేయనున్నారు. తొమ్మిదవ ఎపిసోడ్ లో లైగర్ సినిమా టీం గెస్టులుగా రాబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ షోకి పూరి జగన్నాధ్, ఛార్మి, విజయ్ దేవరకొండ వచ్చారు. వీళ్ళతో బాలయ్య రచ్చ రచ్చ చేశారు.

Prabhas : 2023 సమ్మర్‌లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ K’ విడుదల

‘మాటల గన్‌.. మన జగన్‌’అంటూ పూరి జగన్నాధ్ ని ఆహ్వానించాడు బాలయ్య. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్‌’ సినిమా గురించి మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను మ‌ర‌చిపోలేని పాత్ర తేడా సింగ్‌ అని బాలయ్య అన్నారు. అలాగే.. నేనెంత యెద‌వ‌నో నాకే తెలియ‌దు అని డైలాగ్‌ను చెప్పి ‘ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా’అని అన్నారు బాలయ్య. ఇక సినిమాలోని మామా ఏక్ పెగ్ లా.. సాంగ్‌ను కూడా బాల‌కృష్ణ గుర్తు చేశారు.

ఆ తర్వాత చార్మి గురించి మాట్లాడుతూ.. అల్లరి పిడుగు మూవీ టైమ్‌లో మనం ఫస్ట్‌టైం కలిశామని గుర్తు చేసి ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ చార్మిపై సెటైర్లు వేశాడు.

తర్వాత విజయ్ దేవరకొండ రాగా ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్‌ ‘అర్జున్‌ రెడ్డి’ అంటూ విజయ్‌ దేవరకొండను హాగ్ చేసుకున్నాడు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్‌ అయిపోయావ్‌’అని విజయ్‌ని ప్రశ్నించగా.. ‘ఫస్ట్ నుంచి అది చేయద్దు, ఇది చేయద్దు లాంటి మాటలు విని విసిగిపోయా… లేదు ఇది కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా అందుకే అందరూ రౌడీ’ అంటారని విజయ్ తెలిపాడు.

Allu Arjun : ‘రౌడీబాయ్స్’ ఈవెంట్లో ‘శ్యామ్ సింగరాయ్’ని పొగిడిన ఐకాన్ స్టార్

ఆ తర్వాత లైగర్ టీమ్‌కి సరదాగా కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ.. ‘ఈ బిజినెస్ బాగుందే.. సైడ్ బిజినెస్’ అంటూ నవ్వులు పంచారు. ‘బ్యాంకాక్‌లో కొబ్బరిబోండాల్లో వోడ్కా కలిపి ఇస్తారు’ అని చార్మి అనగా… ‘అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం’ అని బాలయ్య ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ప్రోమోని ఈ రేంజ్ లో ఉందంటే ఎపిసోడ్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.