Vijay: విజయ్-గోపీచంద్ సినిమాను ప్రొడ్యూస్ చేసేది వారేనా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Vijay: విజయ్-గోపీచంద్ సినిమాను ప్రొడ్యూస్ చేసేది వారేనా..?

Vijay Gopichand Malineni Movie To Be Produced By This Banner

Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘వారిసు’ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

Vijay: ‘వారసుడు’ హీరో మరో తెలుగు డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టాడా..?

ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగాక ముందే, తన నెక్ట్స్ మూవీని ఓకే చేసే పనిలో ఈ హీరో ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన నెక్ట్స్ మూవీని కూడా ఓ తెలుగు డైరెక్టర్‌తో చేసేందుకు విజయ్ ఆసక్తిని చూపుతున్నాడట. నందమూరి బాలకృష్ణకు ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Vijay : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తమిళ్ స్టార్ విజయ్.. ఎంట్రీతోనే సోషల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు..

ఇప్పటికే గోపీచంద్ చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోయేది ఎవరనే విషయంపై మరో వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యారట. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను త్వరలోనే ఇవ్వనున్నారట.