Sonusood: హీరోలు సోనూను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క. విలన్ కదా అని హీరో ఇష్టం వచ్చినట్లు చితకబాదుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలా? నెవర్ పాత్ర విలనే అయినా సరే సోనూభాయ్ దెబ్బలు తింటుంటే చూసి తట్టుకోలేం. ఇది ఇప్పుడు మన సినిమా ప్రేక్షకుల పరిస్థితి.

Sonusood: హీరోలు సోనూను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

Sonusood

Sonusood: ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క. విలన్ కదా అని హీరో ఇష్టం వచ్చినట్లు చితకబాదుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలా? నెవర్ పాత్ర విలనే అయినా సరే సోనూభాయ్ దెబ్బలు తింటుంటే చూసి తట్టుకోలేం. ఇది ఇప్పుడు మన సినిమా ప్రేక్షకుల పరిస్థితి. సోనూసూద్ అంటే నెగటివ్ పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి సినిమా అంతటి స్థాయి భారీ సక్సెస్ సాధించిందంటే అమ్మ బొమ్మాలి అంటూ సోనూ పండించిన పాత్ర కీలకం. అయితే.. ఇప్పుడు సినిమాలో సోను ఉండాలి కానీ హీరోలు కొడుతుంటే చూసే పరిస్థితి ఉందా అన్నదే అర్థంకాకుండా ఉంది.

ఆ మధ్య ఓ సినిమాలో హీరో సోనూసూద్ ను కొడుతుంటే తట్టుకోలేని ఓ పిల్లాడు ఏకంగా టీవీని పగలగొట్టేశాడు. పాత సినిమాలకే అలాంటి రియాక్షన్ కనిపిస్తే ఇక రాబోయే సినిమాల పరిస్థితి ఏంటి. సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. పుష్ప రెండో భాగం కోసం కూడా సోనూతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇది కూడా నెగటివ్ రోల్ అనే అంటున్నారు.

అయితే.. కరోనా సమయం నుండి సామజిక కార్యక్రమాలతో దూసుకుపోతున్న సోనూసూద్ ప్రజలలో రియల్ హీరోగా మారిపోయాడు. దీంతో ఇప్పుడు రీల్ విలన్ గా సోనూసూద్ ను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. తమ సినిమాలో సోనూసూద్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందన్నది నిజమే అయినా నెగటివ్ రోల్ ఏమైనా మైనస్ అవుతుందా అనే డైలమాలో ఉంటున్నారు. ఒక సినిమా విడుదల అయితే కానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.