SRIYA LENKA :భారత్ లో తొలి K-పాప్ స్టార్ గా ఒడిశా యువతి రికార్డు..కొరియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్

భారత్ లో తొలి K-పాప్ స్టార్ గా ఒడిశా యువతి రికార్డు సృష్టించింది. అంతేకాదు..కొరియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

SRIYA LENKA :భారత్ లో తొలి K-పాప్ స్టార్ గా ఒడిశా యువతి రికార్డు..కొరియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్

Sriya Lenka..first Indian K Pop Star

Sriya Lenka..first Indian K-Pop star : కరోనా అందరి జీవితాలను తలకిందులు చేసి పారేసింది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం ఊహించని అద్భుతాలకు కారణమైంది. ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టడానికి వీల్లేని సమయంలో కొందరు తమ స్కిల్స్‌ని బాగా డెవలప్‌ చేసుకున్నారు. ఒడిశాకు చెందిన శ్రీయ లెంక ఇదే పని చేసింది. ఇప్పుడామె తొలి ఇండియన్ కె – పాప్‌ స్టార్‌గా ఎదిగింది. ఒక సాధారణ అమ్మాయి పేరు ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌గా మార్మోగిపోతోంది. K- పాప్ గురించి టీనేజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొరియన్‌ డ్రామాలు, బిటిఎస్‌ మ్యూజిక్‌ బ్యాండ్లతో కొరియన్‌ గాయకులు, యాక్టర్లు వరల్డ్‌ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. భారత్‌లోనూ వీళ్లకు ఫ్యాన్స్‌ ఉన్నారు. ఒక ఆల్బమ్‌ రిలీజ్ చేశారంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అది ఓ ఊపు ఊపేస్తుంది. అలాంటి కె – పాప్‌కి ఒడిశాకు చెందిన యువతి ఎంపికైంది. ఏకంగా ఇండియాలోనే తొలి కె-పాప్ స్టార్‌గా సంచలనం సృష్టించింది.

ఈమె పేరు శ్రీయ లెంక. వయస్సు 18 ఏళ్లు. ఒడిశాకు చెందిన ఈమెకు కరోనా కాలం బాగా కలిసొచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో బామ్మ ఇచ్చిన సలహాతో డ్యాన్సింగ్‌, సింగింగ్‌ స్కిల్స్‌ను మరింత ఇంప్రూవ్‌ చేసుకుంది.సమయాన్ని వృధా చేయకుండా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించింది. శ్రీయాకు K-పాప్ అంటే చాలా ఇష్టం. ఎక్సోస్‌ గ్రౌల్‌ ఎమ్‌వి యూట్యూబ్‌ మ్యూజిక్‌ ఛానల్‌కు ఫ్యాన్‌గా మారి ఆ పాటలను, డ్యాన్స్‌లను అనుకరించే ప్రయత్నం చేసేది. అంతేకాదు లాక్‌డౌన్‌ టైంలో ఆడిషన్ ఇచ్చేందుకు కొన్ని వీడియోలను కూడా చేసింది. కొరియన్ డ్రామాలు చూడడంతో పాటు ఆన్‌లైన్‌లో కొరియన్ లాంగ్వేజ్ క్లాస్‌లు వింటూ వారి భాషపై పట్టు పెంచుకుంది. బ్లాక్‌స్వాన్‌లో హైమీ గ్రూప్‌ని వదిలిపెట్టడంతో.. ఆ ప్లేస్‌ని రీప్లేస్‌ చేసేందుకు యూట్యూబ్‌ ఆడిషన్స్‌ పెట్టారు. ఇందులో నాలుగు వేల మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి మరీ.. బ్లాక్‌స్వాన్‌లో శ్రీయ చోటు దక్కించుకుంది.

శ్రీయతో పాటు బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేలా కూడా బ్లాక్‌స్వాన్‌కు సెలక్ట్‌ అయింది. ప్రస్తుతం వీళ్లిద్దరికీ సియోల్‌లో కొరియన్ భాష, సంగీతం, డ్యాన్స్‌పై ట్రైనింగ్‌ ఇస్తున్నారు. త్వరలో ఓ అద్భుతమైన మ్యూజిక్ వీడియోతో కె – పాప్‌ ముందుకు రానుంది. అందులో శ్రీయ కూడా ఉండనుంది. శ్రీయకు పాప్ వరల్డ్‌లో తాను ఫేమస్ అవ్వాలన్న కోరిక మొదటి నుంచీ ఉండేది. పన్నెండేళ్ల వయసు నుంచే ఒడిస్సీ క్లాసికల్‌ మ్యూజిక్‌తో పాటు, హిప్‌ హాప్‌, కాంటెంపరరీ డ్యాన్సులు శ్రీయ ప్రాక్టీస్ చేసేది. ఆమె గోల్‌ రీచ్‌ అయ్యేందుకు తండ్రి కూడా ఫుల్‌గా సపోర్ట్‌ చేశారు. శ్రీయ చిన్నప్పటి నుంచీ, తనకిష్టమైన డ్యాన్స్‌లో రాణిస్తూ, ఎన్నో పోటీల్లో నెగ్గింది. ఇప్పుడు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. అంతేకాదు ఇండియాలోనే తొలి కె-పాప్ స్టార్‌గా రికార్డు సృష్టించింది.