2.3-Foot Tall Man: 2.3 అడుగుల ఈ వ్యక్తికి ఎట్టకేలకు పెళ్లి కుదిరింది.. మోదీ, యోగిని పిలుస్తాడట

అతడి పేరు అజీం మన్సూరీ.. ఎత్తు 2.3 అడుగులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఉంటాడు. అజీం మన్సూరీ పొడవు చాలా తక్కువగా ఉండడంతో తాను పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ చాలా కాలంగా బాధపడిపోయాడు. తనకు పెళ్లి చేయాలంటూ 2019లో పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి పోలీసులకు తన బాధ చెప్పుకున్నాడు. అంతకుముందు, అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కూడా కలిసి తనకు వధువును వెతికి పెట్టాలని కోరాడు. అప్పట్లో అతడి బాధకు సంబంధించిన వార్తలు, వీడియోలు దేశ వ్యాప్తంగా ప్రసారమయ్యాయి. ఇప్పుడు అతడి జీవిత ఆశయం నెరవేరబోతుంది.

2.3-Foot Tall Man: 2.3 అడుగుల ఈ వ్యక్తికి ఎట్టకేలకు పెళ్లి కుదిరింది.. మోదీ, యోగిని పిలుస్తాడట

2.3-Foot Tall Man: అతడి పేరు అజీం మన్సూరీ.. ఎత్తు 2.3 అడుగులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఉంటాడు. అజీం మన్సూరీ పొడవు చాలా తక్కువగా ఉండడంతో తాను పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ చాలా కాలంగా బాధపడిపోయాడు. తనకు పెళ్లి చేయాలంటూ 2019లో పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి పోలీసులకు తన బాధ చెప్పుకున్నాడు.  అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కూడా కలిసి తనకు వధువును వెతికి పెట్టాలని కోరాడు.

అప్పట్లో అతడి బాధకు సంబంధించిన వార్తలు, వీడియోలు దేశ వ్యాప్తంగా ప్రసారమయ్యాయి. ఇప్పుడు అతడి జీవిత ఆశయం నెరవేరబోతుంది. పెళ్లి జరగబోతుంది. అజీం మన్సూరీకి పెళ్లి కూతురు దొరికింది. ముహూర్తం కూడా నిశ్చయమైంది. పెళ్లి బట్టలు కుట్టించుకుంటున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.

‘‘నవంబరులో నా పెళ్లి జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి శుభలేఖలు అందించి నా పెళ్లికి ఆహ్వానిస్తాను. ఇందుకోసం నేను త్వరలోనే ఢిల్లీకి వెళ్తాను’’ అని చెప్పాడు. అతడిని హాపూర్ లోని బుషారా అనే 3 అడుగుల అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 7న వారిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటవనున్నారు. తనకు కాబోయే భార్య కోసం మన్సూరీ బట్టలు కూడా కుట్టించాడు. అతడికి ఓ కాస్మొటిక్ స్టోర్ ఉంది. బాగానే సంపాదిస్తున్నాడు. తనను బడిలో పొట్టివాడని పిలుస్తున్నారని, చిన్నప్పుడు 5వ తరగతిలోనే చదువు మానేశాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..