దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు: సరిహద్దులో అమరులైన సైనికులు

  • Published By: vamsi ,Published On : January 1, 2020 / 06:07 AM IST
దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు: సరిహద్దులో అమరులైన సైనికులు

కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజే చీకటి తెలవారకముందే.. దేశంలో కొత్త సంవత్సరం సంబరాలు జరుగుతున్న వేళ.. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారీగా పాకిస్తాన్ రెచ్చిపోయింది.

ఉగ్రవాదులు, భద్రత బలగాలు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) నుంచి భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నించగా ఖారి త్రయత్ అడవిలో చొరబాటుదారులను అడ్డగించేందుకు ప్రయత్నించారు ఆర్మీ అధికారులు. 

ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు నౌషెరా సెక్టార్లో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాడుదులు కాల్పులకు దిగడంతో ఇద్దరు ఆర్మీ సైనికులు అమరవీరులయ్యారు. ఇంకా సెర్చ్‌​ ఆపరేషన్‌ కొనసాగుతుంది.

ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ ముకుంద్‌ నరవాణే.. పొరుగుదేశం ఉగ్రవాదాన్ని మానకపోతే ఆ దేశంలో ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసిన తర్వాత రోజే ఈ ఘటన జరిగింది.