తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంకు సాధించిన మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ పేరుతో నకిలీ ఖాతాలు

  • Published By: naveen ,Published On : August 9, 2020 / 12:47 PM IST
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంకు సాధించిన మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ పేరుతో నకిలీ ఖాతాలు

ఐశ్వర్య షెరాన్. ఓ మోడల్. ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించడమే. కాగా, ఈ సివిల్స్ ర్యాంకర్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుపై సోషల్ మీడియాలో 20 నకిలీ ఖాతాలున్నాయని, అవి తనవి కాదని ఫిర్యాదు చేసింది. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుతో నకిలీ ఖాతాలు ఉన్నాయని షెరాన్ పోలీసులకు చెప్పింది. తన అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ముంబైలోని కోలాబా పోలీస్‌స్టేషన్‌లో శనివారం(ఆగస్టు 8,2020) ఆమె కంప్లయింట్ చేసింది.

Model Aishwarya Sheoran clear upse lot of praise on social media ...

ఇన్ స్టాలో 20 ఫేక్ అకౌంట్లు:
23 ఏళ్లకే సివిల్స్ పాస్ అయ్యిన ఐశ్వర్య షెరాన్ గతంలో అందాల పోటీల్లో పాల్గొంది. ఆమె 2016 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌ కావడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సోషల్ మీడియా అకౌంట్ల గురించి అడగగా తనకసలు సోషల్ మీడియాలో అకౌంట్లు లేవని చెప్పింది. దాంతో రిపోర్టర్, మీ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి కదా అవి మీవి కావా అని ప్రశ్నించటంతో ఆమె షాక్ అయింది. వెంటనే ఆమె వాటి గురించి ఆరా తీసింది. అవి ఫేక్ అకౌంట్లు అని తెలుసుకున్న మరుక్షణమే పోలీసులను ఆశ్రయించింది. ఒక ఫేక్ అకౌంట్ కి అయితే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు కూడా ఉండటం ఆమెని మరింత షాక్ కి గురి చేసింది. అందులో ఆమె అనుమతి లేకుండా ఫోటోలను అప్లోడ్ చేశారు. ఆగస్టు 5న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో నకిలీ ఖాతాల విషయం వెలుగు చూసింది.

UPSC results 2019 | Meet Aishwarya Sheoran, the Miss India ...

రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాక్ అయిన ఐశ్వర్య:
‘ఆగస్టు 5న ఓ న్యూస్‌ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పేరుతో అనేక అకౌంట్లు ఉన్నాయి. వాటిల్లో మీ అధికారిక అకౌంట్‌ ఏది అని ఆ విలేకరి అడిగాడు. నాకు అసలు ఇన్ స్టాలో అకౌంట్‌ లేదని తెలిపాను. తర్వాత నా సోదరుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్‌ చేయాల్సిందిగా కోరాను. నా పేరుతో 20 ఖాతాలు ఉండటంతో షాక్‌ కి గురయ్యాం. అందులో చాలా వరకు అధికారిక అకౌంట్లలాగే ఉన్నాయి. ఒక ఖాతాకి అయితే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు’ అని ఐశ్వర్య తెలిపింది. ‘ఈ ఫేక్ అకౌంట్లను నిందితులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. డబ్బు కోసం నా సోదరి పేరు, ఫొటోలు వాడుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చాం’ అని ఆమె సోదరుడు అమన్‌ షెరాన్‌ తెలిపాడు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సర్విస్‌ ప్రొవైడర్‌ సాయంతో నకిలీ ఖాతాలను క్లోజ్‌ చేయిస్తామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

जानिए कौन हैं Aishwarya Sheoran, जो मॉडलिंग ...

ఆర్మీ అధికారి అయిన తండ్రి అజయ్‌కుమార్‌తో కలిసి 2017 నుంచి కొలాబోలోనే ఉంటోంది ఐశ్వర్య. అజయ్‌కుమార్‌కు ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్‌ అజయ్‌ కుమార్‌ కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ఐశ్వర్య 2019 యూపీఎస్సీ ఫలితాల్లో 93వ ర్యాంకు సాధించింది.