ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం.. 24గంటల్లో 9మంది!

  • Published By: vamsi ,Published On : June 8, 2020 / 04:08 AM IST
ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం.. 24గంటల్లో 9మంది!

జమ్మూకాశ్మీర్‌లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్‌లోని పింజోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, భద్రతా దళాలకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 

పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేరకు భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి శోధించాయి. ఈ క్రమంలోనే షోపియాన్ జిల్లాలోని పింజోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహించాయి.

షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా.. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తం అయిన సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో.. కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనిక జవాన్లు కూడా గాయపడ్డారు.

పింజోరాకు 12 కిలోమీటర్ల దూరంలోని రెబన్ గ్రామంలో ఆదివారం(07 జూన్ 2020) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఉత్తర కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల్లోకి చొరబడటానికి కవర్ ఫైర్ కూడా చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం.  వారి సమాచారంతో ఉగ్రవాదులు మరియు పాకిస్తాన్ దుర్మార్గపు చేష్టలను సైన్యం ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది.

Read: కరోనాతో మాజీ ఎంపీ మేనకోడలు మృతి