Bhopal : పెళ్లి పేరిట వధువు మోసం..యువకులకు కుచ్చుటోపి

ఓ వధువు ఐదుగురికి కుచ్చుటోపి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Bhopal : పెళ్లి పేరిట వధువు మోసం..యువకులకు కుచ్చుటోపి

Five grooms in Madhya Pradesh

bride and family : పెళ్లి పేరిట మోసాలు వెలుగు చూస్తున్నాయి. డబ్బులు, విలువైన నగలతో పారి పోతున్నారు. తీరా తాము మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో యువకులతో పాటు..యువతులు కూడా ఉండడం గమనార్హం. మొన్నటి మొన్న..పెళ్లి చేసుకుని అత్తారింటికి అడుగు పెట్టిన ఓ వధువు..తెల్లారేసరికి పారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా…ఓ వధువు ఐదుగురికి కుచ్చుటోపి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని హర్దా జిల్లాలకు చెందిన వరుడు..భోపాల్ జిల్లాకు చెందిన వధువుతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహుర్తం రోజున..వివాహ మండపానికి వరుడు, అతని కుటుంబసభ్యులు చేరుకున్నారు. అక్కడ వధువు, ఆమె కుటుంబసభ్యులు కనిపించకపోయేసరికి షాక్ తిన్నారు. వధువుకు, ఇతరులకు ఫోన్ చేసినా..నో రెస్పాన్స్. స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇతని మాదిరిగానే..మరికొంతమంది యువకులు మోసం పోయారని గ్రహించారు. పెళ్లి పేరిట…యువతి మోసం చేసిందని తేలింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా..ట్రేస్ చేశారు. యువతితో పాటు..ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు ఈ ముఠాను నడిపిస్తున్నారని, యువకులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. యువకులు మొబైల్ నెంబర్లు ఇవ్వడం, భోపాల్ చేరుకోవాలని నిందితులు సూచించే వారన్నారు. అక్కడకు చేరుకున్న అనంతరం…వధువు అంటూ పరిచయం చేసేవారని, వారి నుంచి 20 వేల రూపాయలు తీసుకున్నారని CSP Bhupendra Singh వెల్లడించారు. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందన్నారు.
Read More : Coronavirus in Bengaluru : రూటు మార్చిన కరోనా..చిన్న పిల్లలపై కరోనా పంజా, జాగ్రత్త సుమా