Jharkhand : నిరుపేద వృద్ధుడి అకౌంట్ లో రూ. 75 కోట్లు!

జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో పూలో రాయ్..కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు...

Jharkhand : నిరుపేద వృద్ధుడి అకౌంట్ లో రూ. 75 కోట్లు!

Bank

75 Crores Of Rupees In Account : కోటీశ్వరుడు లేక లక్షాధికారి కావాలని కొంతమంది కోరుకుంటుంటారు. వారు చేసిన ప్రయత్నాల్లో కొంతమంది సక్సెస్ అవుతుంటారు. లాటరీలను కొనుక్కుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అయితే..అనూహ్యంగా కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. లాటరీ దక్కడమో..ఇతరత్రా కారణాలతో వారికి భారీగా డబ్బులు వస్తుంటాయి. ఇదిలా ఉంటే..బ్యాంకులు చేసే వ్యవహారంతో కొన్ని చిక్కులు వస్తుంటాయి. నిర్లక్ష్యంగా ఇతర అకౌంట్లలోకి భారీగా డబ్బులు జమ చేసి..చివరిలో నాలిక కరుచుకుంటుంటాయి. కొంతమంది అకౌంట్లలో కోట్లు, లక్షలు జమ చేసిన వార్తలు వింటుంటాం. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Read More : Stock Markets : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో పూలో రాయ్..కుటుంబం నివాసం ఉంటోంది. భార్య, కుమారుడితో కలిసి ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దీని ద్వారా వచ్చే డబ్బును బ్యాంకు అకౌంట్ లో జమ చేసుకుంటాడు. ఇతనికి రాయ్ కినారిలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో అకౌంట్ ఉంది. డబ్బులు తీసుకోవాలని అక్కడకు వెళ్లాడు. రూ. 10 వేలు విత్ డ్రా చేసుకున్నాడు. అనంతర అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో ఆరా తీసి ఆశ్చర్యపోయాడు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ 75.28 కోట్లు ఉన్నట్లు గుర్తించాడు. అయితే..ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడ లేదని వెల్లడించారు. దీనిపై బ్యాంకు అధికారులు స్పందించారు. డబ్బులు ఎక్కడి నుంచి జమయ్యాయో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.